https://oktelugu.com/

Relationship: మీ అందరినీ దూరం చేసేది ఏంటో తెలుసా? దీని మాయలో పడిపోయారు మీరు కూడా

పక్కన ఎవరైనా ఉన్నా కూడా అదే పనిగా ఫోన్ చూస్తుంటారు చాలా మంది. పక్కన మనుషులు ఉన్నారు అని మర్చిపోయి మరీ ఏదైనా కొత్త మెసేజ్ వచ్చినా రాక పోయినా, ఏదైనా కొత్త పోస్ట్ వచ్చినా, రాక పోయినా - ఫోన్ ను చెక్ చేస్తూనే ఉంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 4, 2024 / 04:45 PM IST

    Relationship

    Follow us on

    Relationship: ప్రస్తుతం సంబంధాలను కాపాడుకోవడం పెద్ద టాస్క్ గా మారుతుంది. అయినా కాపాడుకోవాలి అనుకునే వారు తక్కువ. లైట్ తీసుకునే వారు ఎక్కువ. గతంలో మూడో వ్యక్తి వల్ల సంబంధాలు తెగిపోతే.. ఇప్పుడు మాత్రం ఆ శ్రమను ఫోన్ తీసుకుంటుంది. అవును మరీ ఫోన్ ను చూస్తూ రిలేషన్ లను పట్టించుకోవడం లేదు ప్రజలు. అంతేనా ఇంట్లో ఉన్న భాగస్వామిని కూడా మర్చిపోతున్నారు. మరి ఈ ఫోన్ వల్ల జరిగే నష్టాలు ఏంటో ఓ సారి తెలుసుకోండి.

    పక్కన ఎవరైనా ఉన్నా కూడా అదే పనిగా ఫోన్ చూస్తుంటారు చాలా మంది. పక్కన మనుషులు ఉన్నారు అని మర్చిపోయి మరీ ఏదైనా కొత్త మెసేజ్ వచ్చినా రాక పోయినా, ఏదైనా కొత్త పోస్ట్ వచ్చినా, రాక పోయినా – ఫోన్ ను చెక్ చేస్తూనే ఉంటారు. ఈ సమయంలో పక్కనున్న వారి గురించి అంతగా ఆలోచించము.. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తిని ఒంటరి ఫీల్ వస్తుంది. తనకు ఫ్రియారిటీ ఇవ్వడం లేదని బాధ పడతారు. దీని కారణంగా సంబంధంలో దూరం ఏర్పడవచ్చు.

    కంటిన్యూగా ఫోన్ చూస్తూ భాగస్వామికి సమయమే ఇవ్వడం లేదు . ఇలా చేయడం వల్ల మీ భాగస్వామికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉన్న కాస్త సమయం అయినా తనతో స్పెండ్ చేయకుండా ఈ దిక్కుమాలిన ఫోన్ ను పట్టుకున్నారేంటి? ఇంతకీ ఆ ఫోన్ లో ఏం చేస్తున్నారో? మరొకరు ఏమైనా పరిచయం అయ్యారా అంటూ అనుమానాలు కూడా మొదలు అవుతాయి. సో మీ మధ్యల వద్దన్నా గొడవలు పెట్టేది ఫోన్ నే అని గుర్తు పెట్టుకోండి.

    వీడియోల కోసం కొందరు సంతోషంగా ఉన్నా లేకున్నా కూడా బెస్ట్ గా వీడియోలు చేస్తుంటారు. వారి ఎంజాయ్ లైఫ్ ను చూసి అసూయపడడం సర్వసాధారణం.. దీని కారణంగా వ్యక్తులు తమ సంబంధాలను పాడు చేసుకుంటారు. అయితే.. ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుందని అందరి లైఫ్ లు ఒకేలా ఉండవని గుర్తు పెట్టుకోవాలి. భాగస్వామి ఏదైనా మాట్లాడాలి అనుకున్నా కూడా ఆ ఫోన్ మాయలో పడిపోయి మీరు అరవడం, కోపానికి రావడం చేస్తుంటారు. సో ఓ రెండు సార్లు అడిగిన తర్వాత మూడవ సారి తనకు కూడా విసుగు వస్తుంది. ఆ తర్వాత అదే ఫోన్ మిమ్మల్ని లైట్ తీసుకునేలా చేస్తుంది.

    గతంలో జంటలు కలిసి నడవడం, మాట్లాడుకోవడం వంటివి చాలా చేసేవారు. ఇప్పుడు మొబైల్ అందరిని మార్చేసింది. దీని వల్ల దంపతుల మధ్య క్వాలిటీ టైమ్ తగ్గిపోయి సంబంధాలు బలహీనపడుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీని వల్ల రిలేషన్ లలో మరింత దూరం ఏర్పడే అవకాశం కూడా ఉంది.