Twitter Blue Tick Price: టెస్లా కంపెనీ అధినేత, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ వింత నిర్ణయాలు తీసుకుంటున్నారు. వినియోగదారుల నెత్తిన పెనుభారం మోపుతున్నారు. ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయాలు అందరికి కలవరం కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగులను యాభై శాతం తగ్గించి వారిలో ఆందోళన నెలకొనేందుకు కారణమయ్యారు. తాను అనుకున్నది చేయడంలో మస్క్ మొండి వైఖరి ప్రదర్శిస్తారనే వాదన కూడా ఉంది. ఆయన వ్యాపారంలో లాభాలు రావాలని చూస్తారు కానీ వారి సంక్షేమంపై మాత్రం పట్టించుకోరు. దీంతో ట్విట్టర్ ప్రస్తుతం ఏ దారిన వెళ్తుందో తెలియడం లేదు.

ప్రస్తుతం వినియోగదారుల మెడకు మరో ఉచ్చు బిగించేందుకు సిద్ధపడుతున్నారు. ట్విట్టర్ వినియోగానికి కూడా ఫీజు వసూలు చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా మస్క్ తన నిర్ణయం అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూటిక్ వెరిఫైడ్ అకౌంట్ కోసం యూజర్ల నుంచి భారీ చార్జీలు వసూలు చేసేందుకు ఉపక్రమించారు. ప్రతి ఒక్కరు బ్లూ టిక్ ఉపయోగించుకున్నందుకు నెలకు ఎనిమిది డాలర్లు వసూలు చేసేందుకు ముందుకొచ్చారు. దీనిపై విమర్శలు వచ్చినా లెక్కచేయడం లేదు.
నన్ను ఎంతైనా తిట్టుకోండి కానీ చార్జీలు మాత్రం చెల్లించండని చెబుతుండటంతో ఆయన నిర్ణయం అమలు చేస్తారని చెబుతున్నారు. సీఈవో పరాగ్ అగర్వాల్ ను విధుల నుంచి తప్పించారు. ఇంకా యాభై శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకడంతో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు కఠినంగా ఉన్నా ఆయన మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ ట్విట్టర్ ను ముందుకు తీసుకుపోయే క్రమంలో సంపాదనపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

కొద్ది రోజుల తరువాత ట్విట్టర్ వాడే వినియోగదారులకు నెలకు కొంత చార్జీ వసూలు చేసేందుకు కూడా నిర్ణయించుకున్నారు. దీంతో ట్విట్టర్ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. ఇలాగైతే తమ ఖాతా కొనసాగించడం కష్టమనే వాదనలు వస్తున్నాయి. కానీ ఎలాన్ మస్క్ మాత్రం తన పంతం నెగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇన్ని మార్పులు చేపడుతున్న మస్క్ వినియోగదారుల జేబులు గుళ్ల చేసే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని భయపెడుతున్నాయి. అయినా ఆయనలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు.