Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కీలకంగా మారబోతున్నాడు. రాష్ట్రంలో ఎవరికైనా ఆపద వస్తే.. ఊరి కాని ఊళ్లోకి.. వెళ్లి వారికి అండగా ఉంటున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పేదల ఇళ్లు కూల్చారని తెలియగానే 24 గంటలు గడవకముందే ఆ గ్రామంలో పర్యటించారు. వారి గోడు విని తక్షణమే రూ.లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఈ క్రమంలో పవన్ రాజకీయంగా దూసుకుపోతున్నాడని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే తరుణంలో ఆయనకు అభద్రతాభావం కూడా ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొందరు హైదరాబాద్ లోని కొందరు పవన్ పై దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించారు. అయితే ఆయనపై హత్యకు ప్లాన్ వేశారని జనసైనికులు ఆరోపించారు. ప్రముఖ జ్యోతిష్యులు పవన్ జాతకం ఆధారంగా భవిష్యత్ లో ఆయనపై మరోసారి దాడి చేసేందుకు ప్లాన్ వేసే అవకాశం ఉందని అంటున్నారు.

హైదరాబాద్ లోని పవన్ ఇంటి ముందు ఇటీవల కొందరు అర్ధరాత్రి ఆపారు. అక్కడి నుంచి కారునే తీసేయాలని పవన్ బౌన్సర్లు వారిని అడిగారు. ఈ తరుణంలో కారులోని యువకులకు, పవన్ బౌన్సర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు బౌన్సర్లపై యువకుల్లో కొందరు దాడికి దిగడంతో వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా విచారణ చేసిన పోలీసులు కొందరు యువకులను అరెస్టు చేశారు. అప్పటి నుంచి పవన్ కు థ్రెట్ ఉందని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
అయితే ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్న ప్రకారం పవన్ పై మరోసారి దాడి జరిగే ఆస్కారం ఉందని అంటున్నారు. ఆయన జాతకం ప్రకారం రాజకీయంగా కొన్ని కష్టాలను ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. ఓ వైపు ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్నా.. ప్రత్యర్థుల నుంచి అభద్రత ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఆచితూచి అడుగులు వేయాలని అంటున్నారు. ఏపీలో ఏ మూలన చిన్న ఆపద వచ్చినా పవన్ మంది మార్బలంతో వెంటనే అక్కడికి వాలిపోతున్నాడు. వారి సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది చేయడం కొందరికి నచ్చడం లేదని అంటున్నారు.

మొన్న విశాఖలో పవన్ పర్యటించిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఇప్పటం గ్రామానికి వెళ్లినప్పుడు పోలీసులు పవన్ ను రానీయకుండా అడ్డుకున్నారు. ప్రజల కోసం ప్రాణాలు లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నా… కొందరు ప్రత్యర్థుల నుంచి ఆపద వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే జ్యోతిష్యులు ఇలాంటి వాటికి పరిహారం చేయాలని అంటున్నారు. అటు పవన్ సైన్యం సైతం తమ అధినేతకు రక్షణ కల్పించాలని పోలీసులకు వినతిలు అందిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని పవన్ సైన్యం ఆందోళనలో ఉంది.