Bigg Boss 6 Telugu- Revanth: బిగ్ బాస్ లో తరుచూ జరిగే టాస్కులలో ప్రాణం పెట్టి ఆడే కంటెస్టెంట్స్ లో ముందు వరుస లో ఉండే వ్యక్తి రేవంత్..హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరుకు ఇతని ఆట తీరు అలాగే ఉంటూ వస్తుంది..కానీ గేమ్ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టడం వల్ల ఫిజికల్ గా క్రూర మృగం లాగ ప్రవర్తిస్తాడు..అతని వల్ల శారీరకంగా మరియు మానసికంగా తోటి కంటెస్టెంట్స్ బాగా ఇబ్బందికి గురైయ్యారు.

గత వీకెండ్ లో నాగార్జున గారు రేవంత్ కి రేవంత్ కార్డు ఇచ్చి ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు..ఇంకోసారి అలాగే చేస్తే ఇక వార్నింగ్ లు ఉండవు..రెడ్ కార్డు ఇచ్చి ఇంటి నుండి పంపిస్తారు అని దాని అర్థం..నాగార్జున గారు కూడా ‘రెడ్ కార్డు’ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటాడు..అయితే ఈ వార్నింగ్ రేవంత్ మీద గట్టిగా పని చేస్తుందని అందరూ అనుకున్నారు..కానీ అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదని ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో రుజువు అయ్యింది.
ఈరోజు కెప్టెన్సీ టాస్కులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ‘నాగమణులు’ ప్రత్యర్థి టీం నుండి సేఫ్ చేసుకోవాలి..అలా ఎవరైతే ఎక్కువ నాగమణులు సేవ్ చేసుకుంటారో వాళ్ళు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు..ఈ టాస్కులో ఇంటి సభ్యులందరు చెలరేగిపొయ్యి ఆడుతారు..ఈ క్రమం లో రేవంత్ మరోసారి అదుపుతప్పి ఫిజికల్ అవుతాడు..ఆయన తన నాగమణులు కాపాడుకుంటున్న సమయం లో ప్రత్యర్థి టీం ఎటాక్ చేస్తున్నప్పుడు ‘ఇదిగో ఎవరో నన్ను క్రింద నుండి గట్టిగాపట్టి లాగుతున్నారు..మళ్ళీ నేను కూడా అలాగే చేసినప్పుడు ఫిజికల్ అవుతున్నాడు అని ఎవరైనా అంటే తోలు తీసేస్తాను’ అని వార్నింగ్ ఇస్తాడు.

చెప్పినట్టుగానే హౌస్ మేట్స్ అందరి మీద ఎటాక్ చేస్తున్న సమయం లో బాగా ఫిజికల్ అవుతాడు రేవంత్..అప్పుడు ఆది రెడ్డి రేవంత్ ని హెచ్చరిస్తూ ఉంటాడు..’ఎటాక్ చేస్తున్నప్పుడు ఆపుతుంటే దానిని కూడా ఫిజికల్ అంటున్నారు’ అంటూ రేవంత్ అంటాడు..అయితే నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా రేవంత్ ఇలా ప్రవర్తించాడు కాబట్టి ఈ వారం అతనికి రెడ్ కార్డు ఇచ్చి ఇంటికి పంపేయబోతున్నారా లేదా అనేది చూడాలి.