Watermelon : వేసవికాలం రాగానే చాలామంది చల్లదనం కోసం పండ్లను తింటూ ఉంటారు.అయితే వేసవిలో ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని చల్లబరుచుకునేందుకు కూల్ గా ఉండే ఫ్రూట్స్ తినాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే చాలామంది పండ్లు తింటారు.. కానీ ఏ రకమైన పండ్లు తినాలి అనేది సందేహం గానే ఉంటుంది. ఈ తరుణంలో వాటర్ శాతం ఎక్కువగా ఉండే ప్రూట్ తీసుకోవడం మంచిది. వేసవికాలంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో మిగతా వాటికంటే ఎక్కువగా నీటి కంటెంట్ ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరాన్ని చల్ల బరచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే పుచ్చకాయను కొందరు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి.. ఆ తర్వాత దానిని ఫ్రిజ్లో ఉంచి తింటూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఏమాత్రం ఆరోగ్యకరం కాదని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అది ఎలాగంటే..?
Also Read : మార్కెట్లో కల్తీ పుచ్చకాయలు.. ఎలా కనిపెట్టాలంటే?
పుచ్చకాయలో అనేక రకమైన ఆరోగ్య కరమైన పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, అమినో ఆసిడ్స్ వంటివి అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో సిట్రోలియం అనే ఆమ్లం ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సిడెంట్ 6 ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని చక్కెర స్థాయిని కూడా కంట్రోల్ లో వస్తుంది. డైటింగ్ చేయాలనుకునే వారికి పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది.
ఇలాంటి ఎన్నో పోషకాలు ఉన్న పుచ్చకాయ ను నాచురల్ గా తినడం వల్లనే లాభాలు ఉంటాయి. దీనిని ఫ్రిజ్లో ఉంచడం వల్ల ఇందులోని పోషకాలు పాయిజన్ గా మారే అవకాశం ఉంది. దీంతో ఫ్రిజ్లో ఉంచిన పుచ్చకాయను తినడం వల్ల దీనిపై బ్యాక్టీరియా ఉండి శరీరానికి హాని కలుగజేస్తుంది. అందువల్ల పుచ్చకాయను కట్ చేసిన తర్వాత దానిని మొత్తం తినే ప్రయత్నం చేయాలి. కోసిన ముక్కలను ఫ్రిజ్లో ఉంచిన తర్వాత తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమేనని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయలో 92% నీటి కంటెంట్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే శరీరంలో అధిక ఉష్ణోగ్రత కలిగిన వారు దీనిని తీసుకోవడం వల్ల చల్లబరుచుకోవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోను పుచ్చకాయను తీసుకోవడం వల్ల ఎనర్జీగా ఉంటుంది. కానీ దీనిని న్యాచురల్ గా తినేందుకు మాత్రమే అలవాటు చేసుకోవాలి. కోసిన మొక్కలను ఎప్పటికైనా ఫ్రిడ్జ్ లో ఉంచి తినవద్దు. అలా చేస్తే చాలా ప్రమాదమేనని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వేసవి సమీపిస్తున్నందున మార్కెట్లోకి పుచ్చకాయలు విరివిగా వస్తుంటాయి. అయితే వీటిలో కూడా నీటి కంటెంట్ ఎక్కువ ఉన్న వాటినే కొనుగోలు చేయాలి. అది తెలియాలంటే పుచ్చకాయను కొనేముందు ఒకసారి దాన్ని చేతితో పట్టుకొని గట్టిగా ఊపాలి. అప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే తెలుస్తుంది. వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటే రుచికరంగా ఉండదు. అందువల్ల దీనిని కొనేముందు ఇవి పరిశీలించుకోవాలి.
Also Read : మీరు కొనే పుచ్చకాయ మంచిదేనా.. ఇలా గుర్తించాలి..?