Watermelon: సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే వైద్యులు సీజనల్ ఫ్రూట్స్ తప్పక తినాలని సూచిస్తారు. ప్రస్తుతం వేసవి వచ్చేసింది. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే పండ్లు పుచ్చకాయ, మామిడి. పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచింది. అయితే వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఏది మంచిది అనేది గుర్తించడం చాలా కష్టం. ఎలాంటి కాయ కొనాలి, ఏవి ఎర్రగా ఉంటాయి, మంచి రుచిగా ఉంటాయి అని గుర్తించలేదు. అయితే కొన్ని లక్షణాలను బట్టి పుచ్చకాయను తెలుసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం..
వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో పుచ్చకాయ చాలా ప్రధానమైనది. వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. శరీరానికి ఉత్తేజం ఇస్తుంది. ఇందులో 95 శాతం నీరే ఉంటుంది. అందుకే డీహైడ్రేషన్ ముప్పు నుంచి కాపాడుతుంది. అందుకే వేసవిలో పుచ్చకాయలకు గిరాకీ బాగుంటుంది.
రెండు జాతులు..
పుచ్చకాయలు చాలా రకాలు ఉంటాయి. అయితే జాతులు మాత్రం రెండే. ఆడ, మగ. ఆడ పుచ్చకాయ సన్నగా గుండ్రంగా ఉంటుంది. మగ పుచ్చకాయలు పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. ఆడ పుచ్చయాయ రుచికి తియ్యగా ఉంటుంది. మగ పుచ్చకాయలు గుజ్జు, నీరు ఎక్కువగా ఉంటుంది.
పరిమాణంతో సంబంధం లేదు..
ఇక చాలా మంది పెద్ద పుచ్చకాయ రుచిగా ఉంటుందని అపోహపడతారు. పుచ్చకాయ రుచికి దాని పరిమాణంతో సంబంధం లేదు. కాయ ఏ సైజ్‌లో ఉన్నా పట్టుకున్నప్పుడు బరువు ఉండాలి. అలా బరువు ఉంటే కాయ లోపల నీళ్లు, గుజ్జు ఎక్కువగా ఉన్నట్లు అర్థం. సాధారణ సైజులో ఎక్కువ బరువు ఉన్న కాయలను కొనాలి.
పచ్చగా ఉంటే..
ఇక చాలా మంది పచ్చగా ఉండే పుచ్చకాయలు కొంటారు. అవి తాజాగా ఉంటాయనుకుంటారు. కానీ అలాంటి యాయలు పూర్తిగా పక్వానికి రావు. నిజానికి పండిన పుచ్చకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అలాంటి కాయలే రుచిగా ఉంటాయి. ఇక పుచ్చకాయలపై తెలుపు, గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలె ఎంత ముదురు రంగులో ఉంటే ఆ కాయ అంత రుచిగా ఉంటుంది. ఈ మచ్చలు తేనెటీగలు వాలడం వలన ఏర్పడుతాయి.
తొడిమ చూసి..
పుచ్చకాయ తొడిమను చూసి కాయ రుచి గుర్తించొచ్చు. ఎండిపోయిన తొడిమ అయితే బాగా పండినట్లు భావించాలి. అలా కాకుండా పచ్చగా ఉంటే అది పండలేదని అర్థం. పుచ్చకాయ కొనేముందు దానిపై వేళ్లతో కొట్టడం ద్వారా అది ఎలాంటిదో గుర్తించవచ్చు. పుచ్చకాయను కొట్టినప్పుడు టక్ టక్ అని శబ్దం వస్తే ఆకాయ బాగా పండిందని గుర్తించాలి. శబ్దం రాకపోతే ఇంకా పడాలి అని అర్థం. ముక్కుతో వాసన చూస్తే తియ్యటి వాసన వస్తుంది. అలా వాసన వస్తే బాగా పడిందని గుర్తించాలి. అలాంటివి కుళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు అర్థం.