Mobile Charging: సాధారణంగా మనం దూరప్రయాణాలు చేయాలి అంటే తప్పనిసరిగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటాము.రైలులో అన్ని వసతులు ఉంటాయి కనుక చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రైలు ప్రయాణం ఎంతో సుఖంగా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ లో కాలక్షేపం చేస్తూ ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్ లో చార్జింగ్ అయిపోతే చాలామంది ట్రైన్లోనే చార్జింగ్ పెడుతుంటారు. అయితే ఇలా ఛార్జింగ్ పెట్టడం ఎంతవరకు సరైన పద్ధతో ఇక్కడ తెలుసుకుందాం…
మనం రైలులో ప్రయాణిస్తున్న సమయంలో చార్జింగ్ పెట్టుకోవడానికి అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో
చార్జింగ్ సాకెట్ ఉంటుంది. ఇలా ట్రైన్స్ లో ఛార్జింగ్ పెడితే ఫోన్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం సాధారణంగా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం కోసం 230v AC కరెంట్ ఉపయోగిస్తాము కానీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో మనకు 110v DC కరెంట్ అందుబాటులో ఉంటుంది. దీని వల్ల ఒకోసారి చార్జర్, లేదా సెల్ ఫోన్ పాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
Also Read:మీకు రేషన్ సరుకులు అందడం లేదా.. కాల్ చేయాల్సిన నంబర్లు ఇవే?
అదేవిధంగా మనం సెల్ ఫోన్ యుఎస్బీ కనెక్టర్ తో ఛార్జింగ్ పెట్టిన సమయంలో కొన్ని సార్లు మన డేటా హ్యాకర్స్ దృష్టిలో పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా కొన్ని సార్లు సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి మర్చిపోయి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. గనుక పొరపాటున కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదా పబ్లిక్ సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టకపోవడం మంచిదని చెబుతున్నారు. ఒకవేళతప్పనిసరి పరిస్థితులలో ఛార్జింగ్ పెట్టాల్సి వస్తే నెట్ ఆఫ్ చేసి చార్జింగ్ పెట్టడం కొంతవరకు సురక్షితం.
Also Read: ఐఐటీ కాన్పూర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ.. నెలకు రూ.2 లక్షల వేతనంతో?