Nagarjuna: అక్కినేని నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” సీక్వెల్ బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులో ఉంది. అయితే. ఈ సినిమాలో నాగ్ డబుల్ రోల్ చేసాని.. తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. బంగార్రాజులో తాతగా అలాగే కొడుకుగా నాగ్ నటించాడట. ఇక మనవడుగా చైతన్య కనిపిస్తున్నాడు. అయితే, సెకండ్ హాఫ్ లో తండ్రి క్యారెక్టర్ వస్తోందట. మరి ఫస్ట్ పార్ట్ లో తల్లిగా లావణ్య త్రిపాఠీ నటించింది. కాకపోతే, ఆమె క్యారెక్టర్ ను ఎండ్ చేసేశారు. ఆమెను బంగార్రాజులో చూపించడం లేదు.
ఇక సోగ్గాడే ఎక్కడ ఎండ్ అయిందో.. బంగార్రాజు అక్కడ మొదలవుతుందట. జనరేషన్ తేడా ఉంటుంది తప్పా బంగార్రాజు పాత్రలో తేడా ఉండదని.. బంగార్రాజు మనవడిగా చైతూ చాలా బాగా నటించాడని.. ముఖ్యంగా పెద్ద బంగార్రాజు పాత్ర ఎలా ఉండేదో.. చిన్న బంగార్రాజు పాత్ర కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తోంది. జీవితంలో మూడు దశల్లో ఉండే ప్రేమ కథతో ఈ సినిమా తీశారు. కథ అయితే చాలా బాగా వచ్చిందట.
Also Read: ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
కానీ అనుకున్న సమయానికి ఈ సినిమాను తీయడమే పెద్ద సవాల్ అయింది. కారణం ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ కు చాలా ఎక్కువ సమయం పట్టింది. రిలీజ్ విషయానికి వస్తే ముందు నుంచి సంక్రాంతికి అనుకున్నారు. అలాగే రిలీజ్ చేసున్నారు. ఇక నాగార్జున, నాగ చైతన్య పాత్రలు సమానంగా ఉంటాయి. మరి దీనికి కూడా సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా అద్భుత విజయం సాధిస్తే.. సీక్వెల్ ప్లాన్ చేస్తారేమో.
Also Read: మీకు రేషన్ సరుకులు అందడం లేదా.. కాల్ చేయాల్సిన నంబర్లు ఇవే?