Night Shifts Women: నేటి కాలంలో భర్తతోపాటు భార్యలు కూడా ఉద్యోగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని కంపెనీలు, సంస్థలు సైతం మహిళల కోసం ఉద్యోగాలను కేటాయిస్తున్నాయి. అయితే కొన్ని రంగాల్లో.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో రాత్రులు కూడా విధులు నిర్వహించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో మహిళలు నైట్ షిఫ్టులో విధులు ఎక్కువగా నిర్వహించడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిపై సంతాన ఉత్పత్తి ప్రభావం ఉంటుందని అంటున్నారు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
రాత్రివేళలో పనిచేసే మహిళలపై జీవో గడియారం డిపాజిట్ ఉంది. అంటే అస్తవ్యస్త ఆహారం తీసుకోవడం.. సరైన సమయంలో నిద్రించకపోవడం వల్ల వారి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నైట్ షిఫ్ట్ లో ఉండే మహిళా ఉద్యోగులు రాత్రి సమయంలో ఉత్సాహంగా ఉంటారు. పగలంతా విశ్రాంతి తీసుకుంటారు. ఇలాంటి సమయంలో వారిలో హార్మోన్లు అస్తవ్యస్తంగా మారుతాయి. ఎందుకంటే ఉదయం ఉత్సాహంగా ఉండి రాత్రి సమయంలో ని తీర్చడం వల్ల హార్మోన్ల సమతుల్యత ఉంటుంది. సంతానోత్పత్తి హార్మోన్లను నియంత్రించడంలో మెలటోనిన్ ముఖ్యపాత్ర వహిస్తుంది. అయితే రాత్రిపూట విధుల్లో ఉంటూ కాంతిని ఎక్కువగా చూసే మహిళల్లో మెలటోనిన్ తగ్గిపోతుంది. దీంతో పునరుత్పత్తి అయ్యే హార్మోన్ల సంఖ్య తగ్గుతుంది.
మహిళల్లో రుతు చక్రం సక్రమంగా లేకపోయినా కూడా సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో విధుల్లో ఉండే మహిళల్లో రుతుచక్రం దెబ్బతింటుంది. సరైన సమయంలో పిరియడ్స్ కాకపోతే సంతాన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే నైట్ షిఫ్ట్ లో ఉండే మహిళల్లో గర్భస్రావం ఉండే ప్రమాదం ఉంది.. ఇది ప్రారంభంలో తక్కువగా ఉండి ఆ తర్వాత పెరిగే అవకాశం ఉంది. ఇటీవల రాత్రి వీధుల్లో ఉండే మహిళలు గర్భం దాల్చడానికి ఫెర్టిలిటీ చికిత్స తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా మారింది. ఇక సరైన నిద్ర లేకపోవడం వల్ల మహిళల్లో ఒత్తిడి పెరుగుతుంది. చికాకు కూడా వచ్చి ఉపకాయం సమస్యలు వస్తాయి. క్రమంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతారు. ఇవి కూడా సంతాన ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది.
అయితే సంతానం కోరుకునే మహిళలు.. రాత్రి విధులను తగ్గించాలి. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే పగటిపూట నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఎలాంటి డిస్టర్బ్ లేకుండా నిద్రించే ప్రయత్నం చేయాలి. పగటిపూట అయినా సరే ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమయంలో కచ్చితంగా నిద్రించే ప్రయత్నం చేయాలి. రాత్రి విధుల్లో ఉండేవారు ఎక్కువగా ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. శాఖాహారం ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. కూల్ డ్రింక్స్, చిప్స్ వంటి పదార్థాలను దూరం చేసుకోవడం మంచిది. అలాగే యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి నుంచి దూరం అవుతారు. దీంతో సంతానోత్పత్తి సమస్యల నుంచి బయటపడవచ్చు.