India-Afghanistan Relations : భారత్.. ఉగ్రవాద వ్యతిరేక దేశం. ప్రపంచలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానిని ఖండించి బాధిత దేశాలకు అండగా నిలవడంలో ముందు ఉంటుంది. ఇక ఆఫ్గానిస్తాన్.. తాలిబాన్ పాలిత దేశం. తాలిబాన్ అంటేనే ఉగ్రవాదులగా ముద్రపడింది. ఇప్పటికీ ఆ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లేదు. కానీ, భారత్ ఆ దేశానకి గుర్తింపు ఇచ్చింది. భారత్ చుట్టూ శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూత్రం ప్రకారం.. భారత్ ఆఫ్గానిస్తాన్‌ను చేరదీసింది. దీంతో ఇప్పుడు ఇరు దేశాలు ఒక్కటయ్యాయి. ఇది భద్రత, రాజకీయ పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమవుతున్న ఆసియా ప్రాంతంలో కీలక భాగస్వాములుగా మారాయి. ఈ రెండు దేశాలు ఉగ్రవాదం వ్యతిరేకంగా ఐక్యంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటిగా..
ఆసియా ప్రాంతంలో ఉగ్రవాద సంస్థలు కష్టాలు పెంచుతున్నాయి. భారతదేశం, ఆఫ్గాన్ జట్టుగా ఉగ్రవాద సంస్థలను ఎత్తివేయాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం నిర్మూలనతో ప్రజల జీవనం మెరుగు పడుతుందని, భద్రత బాగుంటుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశానిపై దాడి చేసినా.. ఆప్గాన్‌పై దాడి జరిగినా ఒకరికి ఒకరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. ఒకరిపై జరిగిన దాడిని తమపై జరిగినట్లుగా ఇకపై ఇరు దేశాలు భావించనున్నాయి. ఈమేరకు రెండు దేశాల మధ్య భద్రతా ఒప్పందం జరిగింది. దీంతో ఇరు దేశాలు భద్రతాపరంగా సహకరించుకుంటూ అభివృద్ధి చెందనున్నాయి.
పాకిస్తాన్‌కు దబిడిదిబిడే..
భారత్-ఆఫ్గాన్ భద్రతా ఒప్పందంతో పాకిస్తాన్‌లో వణుకు మొదలైంది. ఈ క్రమంలో ఇరు దేశాలు ఉగ్రవాదులను నిర్మూలించేందుకు మధ్యస్థ కార్యాచరణ విధానాలు అవలంబించనున్నాయి. భద్రతా బాధ్యతలు పంచుకోనున్నాయి. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ ఆఫ్గానిస్తాన్‌పై దాడి చేసింది. ఇదే సమయంలో భారత్-ఆఫ్గాన్ మధ్య భద్రతాపరమైన ఒప్పందం జరగడం గమనార్హం. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చర్చనీయాంశమైంది.
తాజా ఒప్పందంతో భారతదేశం, ఆఫ్గానిస్తాన్ మధ్య ప్రాంతీయ భద్రతకు మరింత లోతైన భరోసా ఏర్పడుతుంది. పరస్పర గౌరవం, భద్రతా బాధ్యత పంచుకునే విధానం ద్వారా వచ్చే దాడులను సమర్థంగా ఎదుర్కొనే శక్తిని ఈ రెండు దేశాలు ప్రదర్శిస్తాయి. దీంతో ఉమ్మడి శత్రు దేశాలకు ఇబ‍్బందులు తప్పవు.
❤️️
India & Afghanistan will work together to eliminate terrorist groups in the region.It is worth noting that an attack on India is considered an attack on Afghanistan.
Similarly, an attack on Afghanistan is considered an attack on India. pic.twitter.com/TYYDfmgFkx
— Afghanistan Defense (@AFGDefense) October 10, 2025