Stress: ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఇలా చేయండి..సింపుల్..

పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకరకంగా కష్టాలు ఉంటాయి. చదువు, ఉద్యోగం, కుటుంబం, ఖర్చులు, పొదుపు, అంటూ భయం, ఆందోళన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. జీవితం కంప్యూటరైజ్డ్‌గా మారడంతో ప్రజలకు శారీరక శ్రమ తగ్గుతుంది. ఈ పరంగా కాస్త లోటు లేదనే చెప్పాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి.

Written By: Swathi Chilukuri, Updated On : July 27, 2024 8:33 am

Stress

Follow us on

Stress: ఒకప్పుడు కూడు గుడ్డ ఇల్లు మాత్రమే ఉంటే చాలు అనుకునేవారు. కానీ ప్రస్తుతం వాటితో పాటు చాలా అవసరాలు, నిత్యావసరాలలో అప్డేట్ అయిపోయారు చాలా మంది. ట్రెండ్ ను బట్టి ప్రతి విషయంలో డబ్బు వృధా చేస్తున్నారు. బ్రాండ్ అంటూ బతుకును బిజీ చేసుకుంటున్నారు. లైఫ్ లో ఉపయోగించే వస్తువుల కోసం బ్రాండ్ అని బతుకును చాలా చీప్ గా చేసుకుంటున్నారు. అంటే క్వాలిటీ లేని జీవితం జీవిస్తున్నారు చాలా మంది. దీంతో ఒత్తిడి వద్దన్నా వచ్చి ఒంట్లో నాట్యం చేస్తుంది. మరి ఈ ఒత్తిడి ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఒత్తిడి ఉందని కనీసం మీరు గుర్తిస్తున్నారా? మీ జీవితంలో మీరు ఎంత వరకు క్వాలిటీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. క్వాలిటీ లైఫ్ అంటే సినిమాలు, షికార్లు, పార్టీలు అంటూ భ్రమ పడకండి. ఒత్తిడి లేని జీవితం క్వాలిటీ లైఫ్ అని సింపుల్ గా చెప్పవచ్చు. మరి ఒత్తిడి ఉండకూడదు అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ టైమ్ ను మీరు మీకోసం స్పెండ్ చేయడమే క్వాలిటీ లైఫ్. మరి ఓ సారి ఆర్టికల్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఏం చేయాలో ఓ సారి చూసేయండి.

పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకరకంగా కష్టాలు ఉంటాయి. చదువు, ఉద్యోగం, కుటుంబం, ఖర్చులు, పొదుపు, అంటూ భయం, ఆందోళన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. జీవితం కంప్యూటరైజ్డ్‌గా మారడంతో ప్రజలకు శారీరక శ్రమ తగ్గుతుంది. ఈ పరంగా కాస్త లోటు లేదనే చెప్పాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. అయితే జీవితంలో ఎలాంటి బాధలు వచ్చినా సరే సానుకూలంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. దీనికోసం కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. వీరి సలహాలు, సూచనలు అనుసరించడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి అవేంటంటే..

ప్రస్తుతం ఇతరుల కోసం సమయాన్ని కేటాయించడం, మనసు విప్పి మాట్లాడటం, మరొకరికి ఇంపార్టెంట్ ఇవ్వడం వంటివి జరగడం లేదు. ఉన్నా కూడా క్వాలిటీ సమయాన్ని స్పెండ్ చేయడం లేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు వంటివారిలో మీకు మెరుగ్గా అనిపించిన వారితో సమయాన్ని గడపండి. సరదాగా ఉండటానికి ప్రయత్నించండి. కలిసి భోజనం చేయండి. బయటకు వెళ్లండి., ఆ రోజు జరిగిన విషయాలను చర్చించండి. మీ రోజును ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించండి.

చురుకుగా ఉండటం మీ శారీరక ఆరోగ్యానికే కాదు, మీ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసిక స్థితి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, జాగింగ్ చేయాలి. కానీ క్రమం తప్పకుండా చేసినప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుండండి. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త విషయాల వేటలో ఉన్నప్పుడు మీరు స్వయంచాలకంగా కొత్త వ్యక్తులను కలుస్తుంటారు. స్నేహితులను కూడా పరిచయం చేసుకుంటారు. అయితే మీకు ఏది ఇష్టమో అది మాత్రమే నేర్చుకోండి. మీకు నచ్చిన విషయాలను నేర్చుకున్నప్పుడు మరింత బాగుంటుంది.

ఎవరు అయినా మీకు బహుమతి ఇస్తే మీరు సంతోషంగా ఉంటారు. అదే విధంగా మీరు ఎవరికి అయినా ఇచ్చినా సరే వారు కూడా సంతోషంగానే ఉంటారు. వారి సంతోషంలో మీకు సంతోషం అనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు చిన్నచిన్న బహుమతులు ఇచ్చి బోనస్‌గా ఆనందాన్ని పొందండి. జరిగిన వాటిని మార్చడం కష్టం. కానీ వాటిని మర్చిపోయి ముందుకు వెళ్లండి. ఎప్పుడో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడాలి కానీ అదే బాధలో ఉండకూడదు. ఒత్తిడిని పెంచుకోవద్దు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యూచర్ గురించి కలలు కంటూ.. మంచి లైఫ్ ను లీడ్ చేస్తూ సంతోషంగా ఉండండి.