IPhone: ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ శుభవార్త మీ కోసమే..

ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కస్టం డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ధరలను పూర్తిగా తగ్గించేసింది. బడ్జెట్లో కేంద్రం కస్టం డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన ప్రయోజనం కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో యాపిల్ తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 27, 2024 8:29 am

IPhone

Follow us on

IPhone: సాంకేతిక ప్రపంచం రోజురోజుకు మారుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సెల్ ఫోన్ కూడా అనేక మార్పులకు గురవుతోంది. అయితే ఇలాంటి మార్పులను అన్ని కంపెనీల కంటే ముందుగా చేసి చూపించేది యాపిల్. సాంకేతిక ప్రపంచానికి సరికొత్త దిశా నిర్దేశం చేసే కంపెనీగా యాపిల్ కు పేరు ఉంది. అందుకే ఈ సంస్థ తయారు చేసే ఉత్పత్తులంటే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆసక్తికి తగ్గట్టుగానే యాపిల్ కూడా ప్రతి ఏడాది సరికొత్త వెర్షన్లలో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. ముందుగా అమెరికా మార్కెట్లో విడుదల చేసి.. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచుతుంది. అయితే మనలో చాలామంది యాపిల్ ఫోన్ వాడటం అనేది ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తారు. అయితే యాపిల్ కంపెనీ విక్రయించే ఉత్పత్తుల ధరలను ఏమాత్రం తగ్గించదు అనే అపవాదు ఉంది. అయితే దానిని రూపు మాపేందుకు యాపిల్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తన వినియోగదారులను పెంచుకునేందుకు సరికొత్త శుభవార్త చెప్పింది.

ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కస్టం డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ధరలను పూర్తిగా తగ్గించేసింది. బడ్జెట్లో కేంద్రం కస్టం డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన ప్రయోజనం కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో యాపిల్ తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది. ఫలితంగా ఐఫోన్ ధరలు మూడు నుంచి నాలుగు శాతం వరకు తగ్గాయి. యాపిల్ తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ప్రో మోడల్ 5100, ప్రో మాక్స్ మోడల్ 6000 వరకు ధర తగ్గింది . ఇక మన దేశంలో తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడల్స్ ధరలు కూడా స్వల్పంగా తగ్గాయని తెలుస్తోంది . ఇక ఐఫోన్ ఎస్ ఈ ధర కూడా 2,300 వరకు తగ్గింది. రివైజ్ చేసిన ధరలను యాపిల్ తన వెబ్ సైట్ లో పేర్కొన్నది.

వాస్తవానికి యాపిల్ కంపెనీ కొత్త మోడల్ మార్కెట్లోకి తీసుకు వచ్చినప్పుడు మాత్రమే పాత మోడల్ పై ధరలను తగ్గిస్తుంది. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా యాపిల్ ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్ ధరలను తగ్గించడం విశేషం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై కస్టం సుంకాన్ని 20 నుంచి 15% తగ్గించడంతో మొబైల్ ఫోన్ల ధరలు చాలావరకు దిగి వచ్చాయి.. సాధారణంగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్లపై 20 శాతం కస్టమ్స్ డ్యూటీ, రెండు శాతం సర్ చార్జిని ప్రభుత్వం విధించేది. దీనిపై 18 శాతం జీఎస్టీ ని అదనంగా వసూలు చేసేది. అయితే తాజాగా కేంద్రం కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత బేసిక్ కస్టం డ్యూటీ 15%, 1.5% సర్ చార్జీ మొత్తం కలిపి 16.5% చేరుకుంది. అయితే దీనికి 18% జిఎస్టి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. యాపిల్ ప్రస్తుతం దేశంగా 13, 14, 15 బేసిక్ మోడల్స్ ను తయారు చేస్తోంది..ప్రో, ప్రో మ్యాక్స్ రకాలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం నేపథ్యంలో ఈ మోడల్స్ ధరలు చాలా వరకు తగ్గాయి. అయితే దేశంగా తయారైన ఫోన్లపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్న నేపథ్యంలో.. ఆ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు స్వల్పంగానే ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.