https://oktelugu.com/

Eyebrows : మీ ఐబ్రోలు మందంగా రావాలంటే ఇలా చేయండి..

ఇక అందరి ఇంట్లో ఉండే కొబ్బరి పాలు కూడా బెస్ట్ రెమెడీ. కొబ్బరి పాలల్లో శుభ్రమైన కాటన్ ప్యాడ్ ను నానబెట్టి కళ్ల ఐబ్రోల మీద ఉంచండి. దీన్ని కూడా ఓ 15 నిమిషాలు చేస్తే సరిపోతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 4, 2024 / 10:51 PM IST

    Do this to make your eyebrows thicker..

    Follow us on

    Eyebrows : ఆడవారు అందం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కండ్ల దగ్గర నుంచి వెంట్రుకల వరకు అన్నింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక పాదాలు, చేతులు, గోర్లు అంటూ ప్రతి భాగాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అందులో ఓ ఒక్కటి కాస్త అందంగా లేకపోయినా ఏదో విధంగా వాటిని మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ప్రతి నెల అమ్మాయిలు ఐబ్రోల మీద ఖర్చు చేస్తుంటారు. వీటి కోసం కచ్చితంగా పార్లర్ కు వెళ్తుంటారు. మరి ఈ ఐబ్రోలు మందంగా ఉంటే బాగుంటుంది.

    కానీ కొందరికి చాలా పల్చగా ఉంటాయి. ఇలాంటి వారు మందమైన ఐబ్రో రావాలని వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా ఇప్పుడు మనం కొన్ని టిప్స్ చూసేద్దాం. వెంట్రుకలు గట్టిపడి ఒత్తుగా రావాలి అంటే ఆముదం ఉత్తమం. కాస్టర్ ఆయిల్ ను అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ ఆయిల్ మీ కళ్లల్లోకి అసలు రాకూడదు. ఇక లావెండర్ నూనెను కొబ్బరి నూనెతో కలిపి ఐబ్రోలకు రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

    ఈ నూనె జుట్టుకు కూడా బెస్ట్ రెమెడి. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, కొబ్బరి నూనెలను కలిపి అప్లై చేస 30 నిమిషాలు కళ్లకు విశ్రాంతి ఇవ్వండి. ఇక ఈ కనురెప్పలకు మరో బెస్ట్ నూనె విటమిన్ ఇ ఆయిల్. రాత్రి పడుకునే ముందు మస్కరా బ్రష్ తో మీ కనురెప్పలను దీని మీద అప్లై చేసి నిద్ర లేచిన తర్వాత ముఖం కడుక్కోండి సరిపోతుంది.

    మీకు ఐబ్రో మందంగా రావాలి అంటే అలోవెరా జెల్ ను రాయండి. దీన్ని సులభంగా పొందవచ్చు. ఉపయోగించవచ్చు. దీన్ని రాసి ఓ 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇక అందరి ఇంట్లో ఉండే కొబ్బరి పాలు కూడా బెస్ట్ రెమెడీ. కొబ్బరి పాలల్లో శుభ్రమైన కాటన్ ప్యాడ్ ను నానబెట్టి కళ్ల ఐబ్రోల మీద ఉంచండి. దీన్ని కూడా ఓ 15 నిమిషాలు చేస్తే సరిపోతుంది.