Horoscope Today: 2025 మే 5 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచరించనున్నాడు. దీంతో మేష రాశివారికి అనుకోని అదృష్టం కలగనుంది. వృషభ రాశి వారికి ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారికి ఈరోజు అనుకోని అదృష్టం కలగనుంది. కుటుుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు లాబాలు వస్తుంటాయి.
వృషభ రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రత్యర్థుల వ్యూహం నుంచి తప్పించుకోవాలి. ఎంత కష్టం వచ్చినా పొరపాట్లు చేయొద్దు. పాత స్నేహితులను కలుసుకోవడంతో ఉల్లాసంగా ఉంటారు.
మిథునం:
పెండింగు పనులను పూర్తి చేస్తారు. కొందరితో కలిసి పెట్టుబడులు పెడుతారు. ఇది లాభం చేకూరుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు ఉంటాయి.
కర్కాటకం:
ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెడుతారు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. కొన్ని పనులను ప్రణాళికతో చేపడుతారు.
సింహ:
ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వాదనలు చేయొద్దు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
కన్య:
వ్యాపారులు పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాదనలు ఉంటాయి. విద్యార్థులు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.
తుల:
పెండింగు పనులను పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ద చూపాల్సి ఉంటుంది. వ్యాపారుల పెట్టుబడులు లాభిస్తాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు వేస్తారు.
వృశ్చికం:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. వచ్చిన అవకాశాలను విడిచిపెట్టొద్దు. ఓ శుభవార్త వింటారు. విహార యాత్రలకు వెళ్తారు. ఆత్మవిశ్వాసంతో ముందకు వెళ్తారు.
ధనస్సు:
ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో శుభవార్త వింటారు. సంపద పెరుగుతుంది.
మకర:
ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్ లో లాభాలు వస్తాయి. ఏ పని చేసినా బాధ్యతాయుతంగా ఉండాలి. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందేందుకు ప్రయత్నించాలి.
కుంభం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెట్టాలి. ఇతరులతో ఎక్కువగా వాగ్దానాలు చేయొద్దు.
మీనం:
వ్యాపారులు లాభాలు పొందుతారు. డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏ పనినైనా సులభంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.