Husband And Wife Relationship: భార్యాభర్తల బంధం లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది. ఎందుకంటే వివాహమనే బంధంతో ఒకటిగా మారి జీవితాంతం కలిసి ఉండటమనేది నిజంగా గొప్ప విషయమే. దీనికి భర్త కంటే భార్య త్యాగమే ఉంటుంది. కుటుంబ నిర్వహణలో ఆమె చూపే చొరవ అనిర్వచనీయం. ఎంత మంది అయిన వారున్నా భర్తే సర్వస్వం అనుకుని అతడి అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు చూపే చొరవ ఎంతో విలువైనది. తన సొంత వారిని విడిచిపెట్టి మన కోసం మన కుటుంబంలోకి వస్తుంది. తన ఆలోచనలతో కుటుంబాన్ని సవ్యంగా నడపడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పెళ్లినాడు ఉన్న ప్రేమ తరువాత కాలంలో తగ్గిపోతుందనేది పలువురి వాదన. కానీ ఆ అనుమానం రాకుండా చూసుకోవాలి. భార్యను బాధ్యతగా చూసుకుంటే వారు మన మీద ప్రేమ చూపిస్తుంటారు. రోజుకోసారి ఐలవ్ యూ అంటూ ప్రేమను వ్యక్తం చేస్తే చాలు వారు మన వెంట నిలుస్తారు. మనం చేసే పనుల్లో తోడుగా నిలుస్తుంది. ఆలుమగల మధ్య ప్రేమ ముఖ్యమే.
ఏకాంతంగా ఉన్న సమయంలో భార్య చేతిని మన చేతిలోకి తీసుకుని నిమురుతూ మనం మాట్లాడే మాటలకు ఫిదా అయిపోతుంది. ఎన్ని బాధలున్నా మరిచిపోతుంది. ఆలుమగలు కడదాకా ప్రేమగా ఉండాలంటే భాగస్వామితో ముచ్చటగా మూడు మాటలు మాట్లాడితే చాలు. ఎంతో ప్రేమ మన మీద చూపిస్తుంది. ఇలాంటి చిట్కాలు పాటిస్తే సంసారంలో కలతలు రాకుండా ఉంటాయి.
భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే. కానీ వాటిని మరిచిపోయి ఇద్దరి మధ్య అనురాగం పెంచుకోవాలి. పొద్దున జరిగే గొడవలను సాయంత్రం మరిచిపోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతుంది. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇలా భార్యాభర్తలు తమ బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయడం శ్రేయస్కరం.