https://oktelugu.com/

Chittibabu Vs Samantha: నేను నోరు విప్పితే సమంత పరువు పోతుంది… నిర్మాత చిట్టిబాబు ఏం చేయబోతున్నాడు!

ర్మాత చిట్టిబాబు స్పందించారు. సమంత తనపై చేసిన పరోక్ష కామెంట్ కి కౌంటర్ ఇచ్చారు. కొందరు తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. నేను కౌంటర్లు ఇస్తే ఆమెకు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. ఆమె నా పేరు చెప్పలేదు. అందుకే నేను కూడా సమంత పేరు ప్రస్తావించను. నేను కౌంటర్స్ ఇస్తే ఆమె సమాధానం ఇవ్వలేదు అని చిట్టు బాబు అన్నాడు.

Written By:
  • Shiva
  • , Updated On : April 26, 2023 / 10:13 AM IST
    Follow us on

    Chittibabu Vs Samantha: నిర్మాత చిట్టిబాబు వరుస ఆరోపణలు నేపథ్యంలో సమంత స్పందించారు. ఆయన చెవులపై ఉన్న వెంట్రుకలను ఉద్దేశిస్తూ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. బాడీలో టెస్టోస్టిరాన్ ఎక్కువైతే అలా చెవుల మీద వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయంటూ సెటైర్ వేసింది. సమంత నిర్మాత చిట్టిబాబు పేరు ప్రస్తావించనప్పటికీ ఆయన మీదే సమంత ఈ సెటైర్ వేశారన్నది సుస్పష్టం. దీంతో పలు మీడియా సంస్థలు వరుస కథనాలు రాశారు. ఈ క్రమంలో నిర్మాత చిట్టిబాబు స్పందించారు. సమంత తనపై చేసిన పరోక్ష కామెంట్ కి కౌంటర్ ఇచ్చారు.

    కొందరు తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. నేను కౌంటర్లు ఇస్తే ఆమెకు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. ఆమె నా పేరు చెప్పలేదు. అందుకే నేను కూడా సమంత పేరు ప్రస్తావించను. నేను కౌంటర్స్ ఇస్తే ఆమె సమాధానం ఇవ్వలేదు. ఆమె నా వెంట్రుకల గురించి మాట్లాడే కంటే నేను చెప్పిన నిజాల గురించి స్పందిస్తే బాగుండేది… అన్నారు. నేను తలచుకుంటే సమంత బండారం బయటపెడతానని చిట్టిబాబు పరోక్షంగా హెచ్చరించినట్లు కామెంట్స్ ఉన్నాయి.

    ఈ వివాదం చిట్టిబాబు కామెంట్స్ తో మొదలైంది. యశోద విడుదల టైం లో సమంత మాయోసైటిస్ సోకినట్లు వెల్లడించారు. దీన్ని చిట్టిబాబు తప్పుబట్టారు. మాయోసైటిస్ ప్రాణాలు తీసే వ్యాధి కాదు. సాధారణంగా అందరికీ వచ్చేదే. సమంత పెద్ద రాద్ధాంతం చేస్తుందన్నారు. శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. నాకు అనేక సమస్యలు ఉన్నాయని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో చిట్టిబాబు మరింత ఫైర్ అయ్యారు.

    సమంత రోగం, ఏడుపు అంతా నాటకం. సింపథీ కార్డుతో సినిమాలకు ప్రచారం తెచ్చుకోవాలని చూస్తుంది. ప్రతిసారీ ఇది వర్క్ అవుట్ కాదు. ఏడ్చినంత మాత్రాన ప్రేక్షకులు సినిమాలను ఆదరించారు. అయినా సమంత స్టార్డం ఎప్పుడో పోయింది. బతుకుదెరువు కోసం వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది. శాకుంతలం మూవీకి ఆమె సెట్ కాదు. ఆమె వలెనే ప్లాప్ అయ్యిందన్నారు. చిట్టిబాబు ఆరోపణలపై సమంత ఇటీవల పరోక్షంగా స్పందించారు. సమంత కామెంట్ కి చిట్టిబాబు మరలా కౌంటర్ ఇచ్చారు.