Valentine’s Day: వాలెంటైన్ డే 2025: ఫిబ్రవరి నెల కొనసాగుతోంది. ఫిబ్రవరి నెల ప్రేమలో ఉన్నవారికి ప్రత్యేకమైన నెల కదా. ఫుల్ హ్యాపీలో ఉన్నారా? ఇక మీ ప్రేమ గురించి తెలిపాలని తెగ వెయిట్ చేస్తున్నారా? ఫుల్ ప్లాన్స్ లో కూడా ఉండి ఉంటారు కదా. ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు చాలా సంతోషాన్ని అందిస్తుంది. కానీ వన్ సైడ్ లవ్ ఉన్నవారికి అయితే చాలా బాధను కూడా అందిస్తుంది. ఈ రోజున ఎలాగైన తమ ప్రేమను తెలపాలని కొందరు ఆరాటపడితే కొందరు వారి ప్రేమను ఒప్పుకోవాలి అని పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తారు.
ప్రేమికుల జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు అంటే వాలెంటైన్స్ డే అని చెప్పాలి. ఈ రోజు ఈ నెల అంటే ఫిబ్రవరి నెలలోనే వస్తుంది. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ప్రేమికులు ఒకరితో ఒకరు సమయం గడుపుతారు. చాలా మంది ఒకరికొకరు తమ ప్రేమను చాటుకుంటారు.
చాలా మంది పెళ్లికి ప్రపోజ్ కూడా చేస్తున్నారు. భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాలలో ప్రేమ అనేది ఇప్పటికీ సంక్లిష్టమైన అంశం. దీని గురించి బహిరంగంగా మాట్లాడరు కొందరు. కొందరు పెద్దగా పట్టించుకోరు కూడా. అందుకే ప్రేమలో ఉన్నవారు ఇంటికి దూరంగా ఒకరినొకరు తరచుగా కలుసుకుంటారు. చాలా సార్లు, కొందరు వ్యక్తులు ఈ ప్రదేశాలలో ప్రేమలో ఉన్నవారిని అనవసరంగా వేధిస్తారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే, మీరు సహాయం కోసం అడగవచ్చు.
ప్రేమికుల రోజున ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే, ఇక్కడ ఫిర్యాదు చేయండి
భారత రాజ్యాంగం పౌరులందరికీ స్వేచ్ఛా హక్కును కల్పించింది. ప్రేమికుల రోజున, ఒక జంట వారి స్వంత ఇష్టానుసారం ఎక్కడో కూర్చుంటే ఎవరైనా మాట్లాడితే అతడిని వేధించే హక్కు ఎవరికీ లేదు. ఏ సంస్థ లేదా ఏ వ్యక్తి అయినా వారిని ఎక్కడా కూర్చోవడానికి నిరాకరించలేరు. అలాగని వారిని అక్కడి నుంచి వెళ్లిపోమని బలవంతం చేయలేరు. ఎవరైనా ఇలా చేస్తే, మీరు ఆ వ్యక్తి లేదా ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు.
పోలీసులు మిమ్మల్ని వదిలేయమని అడిగితే?
అలాంటి చోటు నుంచి మిమ్మల్ని వెళ్లమని పోలీసులు కోరితే. అప్పుడు కూడా మీరు దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదట. ఏ జంటను ఎక్కడో కూర్చోబెడితే ఆపే హక్కు పోలీసులకు కూడా లేదు అంటున్నారు కొందరు. పార్కులో కూర్చొన్నా సరే కానీ ఎటువంటి అసభ్యకర చర్యలు చేయకూడదు. కాబట్టి మీరు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం లేదట. అలాంటప్పుడు ఆ పోలీసుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
ప్రేమికుల రోజున మీరు మీ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లినప్పుడు, సురక్షితమైన స్థలాన్ని ఎంచుకోండి. వీలైతే, ఎక్కువ మంది వ్యక్తులు ఉండే ప్రదేశానికి ప్రాధాన్యత ఇవ్వండి. అటువంటి పరిస్థితిలో ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. మీరు ఏదైనా కేఫ్, రెస్టారెంట్‌కి వెళ్లవచ్చు. లేదా సినిమా చూసేందుకు వెళ్లవచ్చు. కానీ మీరు సమాజాన్ని ఇబ్బంది పెట్టే ఎలాంటి చేష్టలు చేయడం కూడా సరైనది కాదని గుర్తుంచుకోవాలి.