Relationship: మీ రిలేషన్ బాగుండాలి అంటే ఇలా చేయండి..

రిలేషన్‌లో ఒకరికి ఒకరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ పార్టనర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. లేదంటే నేర్చుకోవాల్సిందే. అది లేకపోవడం, చాలా మంది తేలిగ్గా తీసుకోవడం వల్ల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

Written By: Swathi, Updated On : May 22, 2024 3:21 pm

Relationship

Follow us on

Relationship: భార్యాభర్తల మధ్య గొడవలు కామన్ గా వస్తుంటాయి. కానీ ఈ రిలేషన్ ను ఎంత కాపాడుకుంటే అంత బెటర్ గా ఉంటుంది. లైట్ తీసుకుంటే ఇద్దరి మధ్య గొడవలు కూడా పెరుగుతుంటాయి. ఏ రిలేషన్ లో అయినా గొడవలు కామన్. కానీ ఆ రిలేషన్ కావాలి అంటే కాంప్రమైజ్ కావాల్సిందే. లేదంటే దూరం కావాల్సిందే. అయితే ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణాలు కూడా చాలానే ఉంటాయి. మరి ఆ కారణాలు ఏంటి? ఎలా గొడవలు వస్తాయి అనే వివరాలు తెలుసుకుందాం.

రిలేషన్‌లో ఒకరికి ఒకరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ పార్టనర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. లేదంటే నేర్చుకోవాల్సిందే. అది లేకపోవడం, చాలా మంది తేలిగ్గా తీసుకోవడం వల్ల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. ఇక ఫ్రెండ్స్.. ఫ్రెండ్స్ అంటే మీరిద్దరు అని కాదండోయ్.. పార్టనర్ ఫ్రెండ్స్. మీకు మీ ఫ్రెండ్స్‌తో ఉండాలని, సరదాగా ఎంజాయ్ చేయాలి అని ఎలా ఉంటుందో వారికి కూడా అలానే ఉంటుంది. కాబట్టి, ఎప్పుడైనా సరే వారికంటే కాస్తా టైమ్ ఇవ్వండం ముఖ్యం.

ఇష్టమైన వారితో టైమ్ స్పెండ్ చేయాలి అనిపిస్తుంది కాబట్టి వారి సమయాన్ని వారికి కేటాయించడానికి అడ్డు పడకండి. ఏ రిలేషన్‌లో అయినా సరే కమిట్‌మెంట్ చాలా ముఖ్యం. కమిట్‌మెంట్ లేనప్పుడు ఇద్దరి మధ్య దూరం కూడా చాలా సులభంగా పెరుగుతుంటుంది. ఇచ్చిన మాట మీద నిలబడండి. కమిట్ మెంట్ తోనే వర్క్ చేయండి. చెప్పిన పని చేయడం చాలా ముఖ్యం. వాయిదాలు వేస్తూ ఉంటే మీ మీద నమ్మకం పోయే అవకాశం కూడా ఉంటుంది.

రిలేషన్‌షిప్‌లో మోసం చేయడం పెద్ద డేంజర్ అని గుర్తు పెట్టుకోండి. ఈ మధ్య కాలంలో చాలా రిలేషన్ లు మోసం వల్లనే డిస్ట్రబ్ అవుతున్నాయి. కాబట్టి, రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు కూడా మోసం అనే మాటకు తావు ఇవ్వకండి. దీని వల్ల విశ్వాసం కోల్పోవడం ఖాయం. రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉంచుకోవడం కూడా మరీ ముఖ్యం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒకరి మీద ఒకరికి గౌరవం కూడా పోతుంది.