Tips For Apple: ఆపిల్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్త.. ఇవి చూడాల్సిందే..

రుచికరమైన ఆపిల్స్ తినాలి అనిపిస్తే కొనేటప్పుడు అవి చిన్న పరిమాణంలో, సాధారణ బరువు ఉండేలా చూడండి. ఎందుకంటే, పెద్దగా ఉండే యాపిల్స్‌ త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా, ఎక్కువగా బరువుగా ఉండే ఆపిల్స్ కూడా మంచివి కాదంటారు నిపుణులు.

Written By: Swathi, Updated On : May 22, 2024 3:18 pm

Tips For Apple

Follow us on

Tips For Apple: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక ఆపిల్ తినాలి అంటారు నిపుణులు. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. కొందరు ఏకంగా వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటారు. ఆపిల్స్ లో ఎక్కువగా ఫైబర్, విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎన్నో సమస్యల నుంచి కాపాడుతుంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కానీ ఆపిల్స్ కదా అని ఏవి పడితే అవి తినకూడదు. చూసి మంచివి తీసుకోవాలి. సరైనవి తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంతకీ మంచి వాటిని ఎలా గుర్తించాలో తెలుసా? ఓ సారి చూసేయండి..

రుచికరమైన ఆపిల్స్ తినాలి అనిపిస్తే కొనేటప్పుడు అవి చిన్న పరిమాణంలో, సాధారణ బరువు ఉండేలా చూడండి. ఎందుకంటే, పెద్దగా ఉండే యాపిల్స్‌ త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా, ఎక్కువగా బరువుగా ఉండే ఆపిల్స్ కూడా మంచివి కాదంటారు నిపుణులు.

ఆపిల్స్ సాధారణంగా ఎరుపు, లేత పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తుంటాయి. చాలా మంది రెడ్ కలర్ ఆపిల్స్‌కి అట్రాక్ట్ అవుతుంటారు. కానీ, లేత ఎరుపు, ఆకపచ్చ, మిక్స్డ్ కలర్ ఆపిల్స్ రెడ్ కలర్ ఆపిల్స్ కంటే తియ్యగా, రుచిగా ఉంటాయి కాబట్టి వీటికే ఎక్కువ ఓటు వేస్తారు. ఆకుపచ్చ ఆపిల్స్ పచ్చిగా ఉండటమే కాదు కాస్తా పుల్లగా కూడా ఉంటాయి. పసుపు రంగులో ఉండే ఆపిల్స్ తియ్యగా ఉంటాయి. జ్యూస్‌ కు కూడా ఇవి బాగుంటాయి.

వాసన చూడటం వల్ల కూడా ఆపిల్స్ బాగున్నాయో లేదో తెలుసుకోవచ్చు. స్వీట్ ఆపిల్ అయితే మంచి వాసన వస్తుంది అంటారు నిపుణులు. వాసన సరిగా రాకపోతే వాటిని తీసుకోకూడదు. అయితే, కొన్ని సందర్భాల్లో యాపిల్ వాసన చూసి రుచిని గెస్ చేయడం కూడా కష్టం కావచ్చు. ఓ పండు బాగుందా లేదా అనేది వాటిని చూసి తీసుకోవడంలో కొందరు ఎక్స్ పర్ట్ లు ఉంటారు. వాటిని తాకినప్పుడు గీతలు, చారలు కనిపిస్తుంటాయి. అదే విధంగా కనిపించని మచ్చలు కూడా వాటిని తాకినప్పుడు తెలుస్తుంటాయి. కాబట్టి అలాంటి వాటిని కొనొద్దు.