Cooking Rice: అన్నం నానబెట్టి వండుతున్నారా?

Cooking Rice: మైక్రోవేవ్ ఓవెన్, కరెంట్ రైస్ కుక్కర్ లలో వండుతూ అప్డేట్ జిందగీ అనుకుంటున్నారు. కానీ వీటి వల్ల వచ్చే సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు.

Written By: Swathi, Updated On : June 24, 2024 11:05 am

Cooking Rice

Follow us on

Cooking Rice: అన్నం వండేముందు చాలా మంది నీటిలో కాసేపు నానబెట్టిన తర్వాత వండుతారు. ఇలా వండటం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయని.. అన్నం త్వరగా ఉడుకుతుందని అనుకుంటారు. మరి నానబెట్టి అన్నం వండటం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా లేదా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మైక్రోవేవ్ ఓవెన్, కరెంట్ రైస్ కుక్కర్ లలో వండుతూ అప్డేట్ జిందగీ అనుకుంటున్నారు. కానీ వీటి వల్ల వచ్చే సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. బియ్యం ఉడికించే ముందు నీటిలో నానబెట్టడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఇలా వండితే మంచి నిద్ర వస్తుందట. జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుందట. అయితే నానబెట్టి వండటం వల్ల బియ్యంలోని పోషకాలు బాగా గ్రహిస్తాయట. అంతేకాదు గైసెమిక్ ఇండెక్స్ స్థాయి కూడా ప్రభావితం అవుతుందట.

ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతుందనేది జీఐ స్థాయి తెలుపుతుందట. ఇక ఈ సంప్రదాయ పద్దతిలో అన్నం వండటం వల్ల ఎంజైమాటిక్ విచ్చిన్నం అవుతుందట. ఈ ప్రాసెస్ వల్ల బియ్యంలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లను సాధారణ చక్కెరలుగా విడిపోతాయట. ఇలా వండటం వల్ల మధుమేహ రోగులకు ప్రయోజనకరం.

కొంతమంది బియ్యాన్ని నీళ్లలో 3-4 గంటల పాటు నానబెడతారు.ఎక్కవు సేపు నానబెట్టడం వల్ల బియ్యంలోని విటమిన్లు, మినరల్స్ నీటిలో కరిగిపోతాయట. అంటే బియ్యంలో ఉండే పోషకాలు నశిస్తాయి. బియ్యాన్ని 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే నానబెట్టాలి. అలాగే నీళ్లతో బాగా కడగాలి.