Homeలైఫ్ స్టైల్Sleep Tips: నిద్రలోకి త్వరగా వెళ్లిపోవాలంటే ఇవి చేయండి

Sleep Tips: నిద్రలోకి త్వరగా వెళ్లిపోవాలంటే ఇవి చేయండి

Sleep Tips: ఇప్పుడు మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా తెలుసుకునే స్థాయిలో అభివృద్ధి చెందాం. దీనికి తోడు స్మార్ట్ యుగంలో వెల్లువలా దూసుకు వచ్చిన యాప్స్ వల్ల మన జీవితం మరింత సుఖమయం అయిపోయింది. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. అదేపనిగా ఫోన్ కు బానిస కావడం వల్ల కళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఫలితంగా కునుకు కరువు అవుతుంది. ఒకప్పుడు రాత్రి 8:00 కల్లా ముసుగు తన్నేవారు. ఇప్పుడు రాత్రి 12 దాటినా స్మార్ట్ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. దీనివల్ల కళ్ళకు, శరీరానికి విశ్రాంతి లేకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుండడంతో అనివార్యంగా వైద్య నిపుణుల సూచన మేరకు నిద్ర కలిగించే మాత్రలు వేసుకోవాల్సి వస్తోంది. అయితే దీర్ఘ కాలం ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఆరోగ్యం పై వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పడుకున్న వెంటనే నిద్ర లోకి జారుకోవాలి అంటే ఏం చేయాలంటే.

Sleep Tips
Sleep Tips

వ్యాయామం తప్పనిసరి

ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం… ఇన్నిసార్లు ఆహారం తీసుకున్నాకా అది వెంటనే కరగాలి.. శరీరానికి శక్తినివ్వాలి. అది కరగాలంటే అరిగేదాకా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అప్పుడే శరీరానికి శ్రమ కలుగుతుంది. దేహం అలిసిపోతుంది. ఫలితంగా వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉండదని నివేదికలు చెబుతున్నాయి. రోజూ ఒకే సమయానికి పడుకోవడం వల్ల శరీరం ఒక టైం టేబుల్ కు అలవాటు పడుతుంది. మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ సమయానికి నిద్ర ముంచుకొస్తుంది. నిద్రకి కనీసం మూడు గంటల ముందు భోజనం చేస్తే బాగుంటుంది. దానివల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. తిన్నది పూర్తిగా జీర్ణం అయిపోయి తొందరగా నిద్ర పడుతుంది.

లైట్స్ ఆఫ్ చేయండి

బెడ్ రూమ్ లో చాలామంది లైట్స్ ఆన్ లో ఉంచుతారు. ఆ విద్యుత్ దీపాల కాంతి మన కళ్ళను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల త్వరగా నిద్ర పట్టదు. అలాంటప్పుడు బెడ్ రూమ్ లో లైట్స్ వెంటనే ఆఫ్ చేయండి. మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి. దానిని చూస్తూ ఉంటే నిద్ర పట్టదు. పైగా సమయం అంతా వృధా అవుతుంది.. చాలామందికి పడుకునే ముందు టీ లేదా కాఫీ తాగడం అలవాటు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. టీ లేదా కాఫీలో కెఫిన్ ఉండటంవల్ల నిద్ర భంగం కలుగుతుంది.

Sleep Tips
Sleep Tips

అందుకే రాత్రి పడుకునే ముందు కనీసం నాలుగు గంటల ముందు వరకు వీటిని తాగొద్దు. ఒత్తిడిని దూరం చేసుకుంటే నిద్ర హాయిగా పడుతుంది. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు హాయిగా ఉండేందుకు ప్రయత్నించండి. శరీరంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు నిద్ర ముంచుకొస్తుంది. స్నానం చేసి ఒంట్లో వేడిని తగ్గించుకుంటే నిద్ర మరింత బాగా పడుతుంది. ఇప్పుడు పనివేళలు పూర్తిగా మారిపోయాయి కాబట్టి పొద్దంతా పడుకోవడం.. రాత్రంతా పనిచేయడం పరిపాటిగా మారింది. మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదే. కానీ ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి నిద్ర పట్టదు. అందుకే పగటిపూట నిద్ర పోకపోవడం మంచిది. ఇన్ని చేసినప్పటికీ నిద్ర రాకపోతే పుస్తకం చదవడాన్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల త్వరగా నిద్ర ఆవహించేస్తుంది. మరి ముఖ్యంగా పడుకునే ముందు ధ్యానం చేస్తే మరింత ఫలితం ఉంటుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version