Pawan Kalyan- Shankar: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అభిమానులు ఆరాధ్య దైవంలాగా కొలిచేంత అభిమానం ని సంపాదించుకున్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోకి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో క్రేజీ స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తే ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తాడో ఊహించడానికి కూడా మనం సరిపోము.

కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తం తీసుకుంటే ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసినట్టు దాఖలాలు కూడా ఉండవు..పూరి జగన్నాథ్ తో చేసాడు కానీ..పూరి ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసింది ఆయనే..మధ్యలో రాజమౌళి వంటి క్రేజీ డైరెక్టర్ సినిమా చెయ్యాల్సింది కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు..ఇది అలా ఉంచితే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో కూడా ఒక సినిమా మిస్ చేసుకున్నాడట.
ఇక అసలు విషయానికి వస్తే హిందీ లో అమిర్ ఖాన్ హీరో గా నటించిన ‘3 ఇడియట్స్’ చిత్రం అప్పట్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది..అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని శంకర్ తమిళం లో హీరో విజయ్ తో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..తెలుగు లో కూడా ఈ చిత్రాన్ని ‘స్నేహితుడు’ అనే పేరు తో దబ్ చేసి విడుదల చెయ్యగా ఇక్కడ మాత్రం మిశ్రమ స్పందన లభించింది..అయితే ఈ సినిమాని తొలుత రీమేక్ చెయ్యాలి అనుకున్నప్పుడు డైరెక్టర్ శంకర్ కి గుర్తుకువచ్చిన మొట్టమొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట..ఈ సినిమా కథని అప్పట్లో పవన్ కళ్యాణ్ తో చెయ్యాలని అతనిని కలిసి స్టోరీ ని కూడా వినిపించాడట శంకర్.

అయితే అమిర్ ఖాన్ యాక్టింగ్ ని మ్యాచ్ చేయగలమో లేదో అని భయం తో ఈ రీమేక్ చెయ్యడానికి సాహసం చేయలేదట పవన్..ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యాలనుకున్నాడు..కానీ మహేష్ రీమేక్ సినిమాలలో నటించడానికి ఏ మాత్రం ఇష్టపడడు అనే విషయం మనకి తెలిసిందే..అలా ఆయన కూడా రిజెక్ట్ చెయ్యడం తో విజయ్ తో చేసాడు శంకర్..అలా పవన్ కళ్యాణ్ – శంకర్ కాంబినేషన్ మిస్ అయ్యింది.