Happy Dussehra: ఇలా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు చెప్పేయండిలా!

దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ క్రమంలో అమ్మవారిని రోజుకొక నైవేద్యం పెట్టి పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఒక్కో అవతారంలో కనిపిస్తుంది.

Written By: Kusuma Aggunna, Updated On : October 10, 2024 1:15 pm

Happy-Dussehra

Follow us on

Happy Dussehra:దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ క్రమంలో అమ్మవారిని రోజుకొక నైవేద్యం పెట్టి పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఒక్కో అవతారంలో కనిపిస్తుంది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించిన తర్వాత పదవ రోజు అనగా దశమి రోజు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా అందరూ కొత్త దుస్తులు ధరించి ఎంతో వేడుకగా ఈ దసరా పండుగను జరుపుకుంటారు. అయితే మరి ఈ దసరా పండుగను కన్నుల విందుగా జరుపుకోవాలంటే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు స్పెషల్‌గా విషెష్ తెలియజేయండి. మరి ఈ ఏడాది దసరా శుభాకాంక్షలు అందరికీ ఎలా చెప్పాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎప్పుడు మీ ఫ్యామిలీపై ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

భవిష్యత్తులో మీకు ఎదురయ్యే కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే శక్తి, ధైర్యాన్ని మీకు రావాలని కోరుకుంటూ.. దసరా పండుగ శుభాకాంక్షలు.

తొమ్మిది రోజుల నవరాత్రులు 90 ఏళ్ల పాటు ఆనందాన్ని, శ్రేయస్సును, సక్సెస్‌​ను అందించాలని కోరుకుంటూ మీకు హ్యాపీ దసరా.

అమ్మవారు మీకు మంచి ఆరోగ్యంతో పాటు జీవితాన్ని అందించాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు దుర్గాదేవి ఆశీస్సులు ఎప్పుడు అందాలని కోరుకుంటూ హ్యాపీ దసరా.

దుర్గాదేవి మీ జీవితంలో ఆనందం, ధనం, గౌరవం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ప్రేమ, అనురాగ ఆప్యాయతల్ని కూడా పెంపొందించాలని కోరుకుంటూ హ్యాపీ దసరా.

చెడుపై ఎప్పుడు మంచి విజయం సాధిస్తుంది. అలాగే మీ కష్టాలను అధిగమించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ హ్యాపీ దసరా.

మీరు చేసే ప్రతి పనిలో ఆ అమ్మవారు మీకు లాభాన్ని ఇచ్చి గెలిచేలా చేయాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

ఈ దసరా నుంచి అయిన మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటూ.. అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ హ్యాపీ విజయ దశమి.

మీకు ఉన్న బాధల్ని, కష్టాలను దూరం చేయడంతో పాటు మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటూ.. హ్యాపీ దసరా.

మీరు చేసే ప్రతి పనిలో, ఎంచుకునే మార్గంలో ఆ అమ్మవారు మీకు ఎల్లప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబసభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఉండటంతో పాటు.. దుర్గాదేవి శక్తి మిమ్మల్ని ముందుకు ధైర్యంగా నడిపించాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.

ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులకి ఉండాలని, మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును కూడా అందించాలని కోరుకుంటూ హ్యపీ దసరా.

ఆ దుర్గమ్మ కరుణా, దయ, కటాక్షాలు అన్ని మనందరిపై ఉండాలని కోరుకుంటూ.. అందరికీ దసరా శుభాకాంక్షలు

మన జీవితాల్లో కొత్త పనులను ప్రారంభించి.. సంతోషం, లాభాలు పొందాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.

మీకు మీ మిత్రులకు, శ్రేయోభిలాషూలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.