
Health Tips: నేటి రోజుల్లో ఆహార అలవాట్లు గతి తప్పుతున్నాయి. ఇష్టారాజ్యంగా ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం అనుసరిస్తున్న అలవాట్లు, పొరపాట్లు మనకు దీర్ఘకాలిక సమస్యలు వచ్చేందుకు కారకాలుగా మారుతున్నాయి. దీంతో స్థూలకాయం, గుండె జబబులు, డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధులు చుట్టుముట్టుతున్నాయి. భోజనం చేసిన తరువాత ఎలాంటి ఇతర ఆహారాలు తీసుకున్నా అనర్థాలు వస్తాయి.
Also Read: Gang Leader Re Release: ‘గ్యాంగ్ లీడర్’ రీ రిలీజ్ 3 రోజుల వసూళ్లు..ఇంత తక్కువ వసూళ్లను ఊహించలేదు!
భోజనం చేసిన తరువాత పండ్లు తింటే మంచిది కాదు. అలా తినడం వల్ల జీర్ణాశయానికి చేరి అటు నుంచి పేగుల్లోకి వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. దీనివల్ల గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. తిన్న ఆహారం జీర్ణం కాదు. భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం అంత సురక్షితం కాదు. భోజనం చేశాక ఓ గంటన్నర సమయం దాటాక ఇబ్బందులు రావు. భోజనం చేశాక స్నానం చేయొద్దు. ఇలా చేయడం వల్ల కూడా కష్టాలు తప్పవు.
భోజనం తిన్నాక కాఫీ, టీలు కూడా తాగకూడదు. తాగితే జీర్ణాశయం పనితీరు దెబ్బ తింటుంది. అజీర్ణం, గ్యాస్, ఎసిడిటి సమస్యలు వస్తాయి. తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగా గ్రహించదు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్ర పోకూడదు. అలా చేయడం వల్ల కూడా మనకు జీర్ణం త్వరగా కాదు. స్థూలకాయం సమస్య వస్తుంది. ఈత కొట్టడం, వ్యాయామం చేయడం, పనులు చేయడం వంటివి భోజనం చేశాక చేయొద్దు. కనీసం అరగంట నుంచి గంట తరువాత ఆ పనులు చేస్తే మంచిది.

భోజనం అయ్యాక చాలా మంది బెల్ట్ లూజ్ చేస్తారు. ఇలా చేయడం సమంజసం కాదు. అప్పటి వరకు టైట్ గా ఉన్న పేగులు లూజ్ చేశాక చుట్టుకున్నట్లు ఉంటాయి. వాటిలో కదలిక ఉండదు. భోజనం చేసిన తరువాత పొగ తాగకూడదు. భోజనం చేసినాక కొన్ని అలవాట్లు మానుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు రావడానికి కారణమవుతుంది. ఈ అలవాట్లు మానుకుంటే ఎంతో లాభం కలుగుతుంది. దీంతో భోజనం చేసిన తరువాత ఎలాంటి పదార్థాలు తినకుండా ఉండటమే శ్రేయస్కరం.
Also Read:Sania Mirza- Ram Charan: టెన్నిస్ కి సానియా మీర్జా గుడ్ బై… ఎమోషనల్ అయిన రామ్ చరణ్!