
Gang Leader Re Release: మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో రాబొయ్యే రోజుల్లో ఎన్నో వంద కోట్ల రూపాయిల కలెక్షన్స్ కొల్లగొట్టిన, ఆయన కెరీర్ లో మరోసారి రీ క్రియేట్ చెయ్యలేని అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి కమర్షియల్ సినిమాలు చాలానే ఉన్నాయి.వాటిల్లో ఒకటే ‘గ్యాంగ్ లీడర్’, ఆ రోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.వరుస ఇండస్ట్రీ హిట్స్ తో రికార్డ్స్ తో సావాసం చేస్తున్న మెగాస్టార్ కి మరో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం.
అంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ ని రీ రిలీజ్ చేస్తే థియేటర్స్ లో చూడాలనే కోరిక ప్రతీ ఒక్కరిలో ఉంటుంది.కానీ దానికి ఒక సరైన సమయం మరియు సందర్భం ఉండాలి.ఎప్పుడు పడితే అప్పుడు విడుదల చేస్తే ఫలితం పూర్తిగా తేడా అవుతుంది.ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ విషయం లో కూడా జరిగింది.మార్చి నాల్గవ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం నేటికీ మూడు రోజులు పూర్తి చేసుకుంది.
అయితే ఈ మూడు రోజులకు కలిపి ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు అంతంత మాత్రమే అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.’వాల్తేరు వీరయ్య’ చిత్రం 50 రోజుల సెలెబ్రేషన్స్ ఊపులో ఉన్నప్పుడు విడుదల అవ్వడం వల్ల పలు చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.కానీ మిగిలిన ప్రాంతాలలో ఈ సినిమాకి కనీస స్థాయి వసూళ్లు కూడా రాకపోవడం గమనార్హం.చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం క్లాసికల్ కమర్షియల్ మూవీ గా నిల్చిన ఈ చిత్రానికి ఇలా జరగడం శోచనీయం అంటున్నారు అభిమానులు.

చిరంజీవి పుట్టినరోజు వరకు ఆగి, సరిగ్గా ఆయన పుట్టినరోజు నాడు ఈ సినిమాని రీ రిలీజ్ చేసి ఉంటె అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది అని, మూడవ పార్టీ వాళ్ళు మధ్యలో దిగి బంగారం లాంటి మూవీ రేంజ్ తగ్గించేశారని బాధపడుతున్నారు ఫ్యాన్స్.ఈ చిత్రం మూడు రోజులకు కలిపి 40 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందట.
Also Read:Sania Mirza- Ram Charan: టెన్నిస్ కి సానియా మీర్జా గుడ్ బై… ఎమోషనల్ అయిన రామ్ చరణ్!