Men Menopause: మహిళల్లో రుతుస్రావం ఆగిపోయిన తరువాత కాలాన్ని మెనోపాజ్ అంటారు. నెలనెల వచ్చే రుతుస్రావంతో స్త్రీలకు ఎన్నో ఇబ్బందులొస్తాయి. దీంతో వారికి నెలసరి అయిపోయే వరకు బాధలు ఎదుర్కోవడం సాధారణమే. పురుషుల్లో కూడా మెనోపాజ్ ఉంటుందని ఎంతమందికి తెలుసు. కానీ నిజంగానే పురుషులకు మెనోపాజ్ లాగే అండ్రోపాజ్ ఉంటుంది. ఇది వృద్ధాప్యంలో కనిపిస్తుంది. మహిళలకేమో రుతుస్రావం ఆగిపోతే మెనోపాజ్ అంటారు. పురుషులకు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే అండ్రోపాజ్ అని పిలవడం సహజం.

పురుషుల్లో కూడా మెనోపాజ్ ఉంటుందని తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఆండ్రోపాజ్ వల్ల మగాళ్లలో కూడా పలు సమస్యలు రావడం జరుగుతుంది. రుతుక్రమం వల్ల మహిళల్లో రకరకాల హార్మోనల్ మార్పులు ఉంటాయి. దీంతో మూడ్ స్వింగ్స్ మార్పులు వస్తాయి. మహిళల్లోనే కాదు పురుషుల్లో కూడా పలు మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆడవారికి టీనేజ్ లో రుతుక్రమం మొదలవుతుంది. వృద్ధాప్యంలో మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ వల్ల ఊబకాయం, శరీరంలో వేడి ఆవిర్లు, విపరీతమైన మూడ్ స్వింగ్స్ వంటివి బాధిస్తాయి.
పురుషుల్లో వచ్చే ఆండ్రోపాజ్ వల్ల సమస్యలు ఉంటాయి. హార్మోన్లలో మార్పులు కనిపిస్తాయి. ఇది స్త్రీలలో కంటే భిన్నంగా ఉంటుంది. పురుషుల శరీరంలో టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది. ఇది మగతనంపై ప్రభావం చూపుతుంది. లైంగిక సామర్థ్యం దెబ్బ తింటుంది. ఫలితంగా శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. టెస్టోస్టిరాన్ తగ్గితే ఆండ్రోపాజ్ దశకు వచ్చినట్లు తెలుస్తుంది. ఊబకాయం వస్తుంది. కొవ్వు పరిమాణం పెరగడం వల్ల అధిక బరువు రావడానికి ఆస్కారం ఉంటుంది. రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టకపోవడం, అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

హార్మోన్ల స్థాయి తగ్గడంతో వీర్య కణాల సంఖ్య తగ్గుముఖం పడతాయి. మొటాలిటీ సామర్థ్యం దెబ్బతింటుంది. దీంతో మగతనం తగ్గుతుంది. దీని వల్ల జుట్టు రాలిపోయి బట్టతల వస్తుంది. రొమ్ముల్లో మార్పులు కనిపిస్తాయి. వక్షోజాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలా ఆండ్రోపాజ్ వల్ల కూడా మనకు కొన్ని సమస్యలు వస్తాయి. యాభైకి చేరువయ్యే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుని ఆండ్రోపాజ్ దశలో వచ్చే ఇబ్బందుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.