Gopichand Malineni- Shruti Haasan: ఒకటికి రెండు సార్లు కలిసి పనిచేస్తే పరిశ్రమలో రూమర్స్ లేస్తాయి. ఆ కారణంతోనే శృతి హాసన్-గోపీచంద్ మలినేని మధ్య ఏదో ఉందంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. వీరసింహారెడ్డి ప్రమోషనల్ ఈవెంట్లో శృతి హాసన్ కి గోపీచంద్ మలినేని ఐ లవ్ యూ చెప్పడం పుకార్లకు ఆజ్యం పోసింది. బలుపు మూవీలో మొదటిసారి శృతి హాసన్ కి గోపీచంద్ ఆఫర్ ఇచ్చాడు. రవితేజ హీరోగా నటించిన బలుపు సూపర్ హిట్ కొట్టింది. తర్వాత ఆయన కొన్ని సినిమాలు చేశారు. అవేమీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత క్రాక్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చాడు.

సెంటిమెంట్ కలిసొచ్చి శృతి మరోసారి ఆయనకు సక్సెస్ ఇచ్చింది. రవితేజ-శృతి జంటగా నటించారు. దీంతో ముచ్చటగా మూడోసారి శ్రుతికి గోపీచంద్ మలినేని ఆఫర్ ఇచ్చాడు. ఇది అనుమానాలకు కారణమైంది. వదలకుండా తన సినిమాల్లో హీరోయిన్ గా శృతిని కొనసాగిస్తున్న మలినేని ఆమెకు దగ్గరయ్యారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శృతి-గోపీచంద్ లను ఉద్దేశిస్తూ ట్రోల్స్, మీమ్స్ పెద్ద ఎత్తున మొదలయ్యాయి. ఈ క్రమంలో గోపీచంద్ మలినేని వివరణ ఇచ్చారు.
నేను శృతి హాసన్ తో మూడు సినిమాలు కలిసి పనిచేసే సరికి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. నిజానికి మా మధ్య బ్రదర్-సిస్టర్ రిలేషన్ ఉంది. నా కుటుంబ సభ్యురాలిగా భావిస్తాను. నాకు ఇష్టమైన హీరోయిన్. నా భార్యతో శ్రుతికి పరిచయం ఉంది. ఒకరికొకరు బాగా తెలుసు. మా అబ్బాయి గిఫ్ట్స్ , చాక్లెట్స్ తీసుకొస్తూ ఉంటుంది. శృతితో ఉన్న అనుబంధం, ఇష్టం దృష్టిలో పెట్టుకొని ఆమెకు ఐ లవ్ యూ చెప్పాను. దాన్ని కొందరు వేరే రిలేషన్ గా అర్థం చేసుకొని ట్రోల్ చేస్తున్నారు. శృతి నాకు సిస్టర్ తో సమానం, అని గోపీచంద్ మలినేని రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

కాగా శృతి ఆల్రెడీ ఒక రిలేషన్ లో ఉన్నారు. ఆమె ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఎఫైర్ నడుపుతున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఐ లవ్ యూ చెప్పిన నేరానికి గోపీచంద్ పై అభాండాలు వేస్తున్నారు. ఏది ఏమైనా శృతి, గోపీచంద్ మలినేని పిచ్చ హ్యాపీగా ఉన్నారు. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. బాలయ్య కెరీర్లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఇక శృతికి 2023 సంక్రాంతి చాలా స్పెషల్ గా నిలిచింది. ఆమె నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండూ విజయం సాధించాయి.