Fenugreek Leaves: ఇటీవల కాలంలో డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. షుగర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతే మధుమేహం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ పేషెంట్ల సంఖ్య ఎక్కువవుతోంది. ఫలితంగా మందులు వేసుకుంటూ షుగర్ ను కంట్రోల్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చక్కెరను నియంత్రించే ఆహారాలపై దృష్టి సారిస్తే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్ ను అదుపు చేసే ఆహారాల్లో మెంతికూర కూడా ఒకటి. మెంతితో మనకు ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. మెంతి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి చక్కెర కంట్రోల్ లో ఉంటుంది. మెంతి ఆకులను తినడం వల్ల మనకు పలు రకాల సమస్యల నుంచి దూరం కావచ్చు.

మెంతి మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు ప్రయోజనాలు కలిగిస్తాయి. మనం తిన్న ఆహారాలు త్వరగా అరగడానికి ప్రధాన కారణమవుతాయి. మెంతి ఆకుల టీ తాగితే మలబద్దకం సమస్య ఉండదు. అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. మెంతి ఆకులను తినడం వల్ల గ్యాస్ర్టిక్ సమస్య కూడా పోతుంది. రోజువారీ ఆహారంలో మెంతిని తప్పకుండా చేర్చుకుంటే మధుమేహులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
మంతి ఆకులు శరీరంలో పేరుకుపోయే చెడు కొవ్వును కరిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మగవారిలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. మెంతి ఆకుల్లో ప్యూరోస్టానోలిక సాపోనిన్లు ఉండటంతో టెస్టోస్టిరాన్ ను పెంచుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మెంతులతో లైంగిక వాంఛను పెంచుతాయని చెబుతున్నారు. గుండె జబ్బులున్న వారికి కూడా మెంతులు మంచి టానిక్ లా పని చేస్తాయి. హృద్రోగులు మెంతి ఆకులను తరచుగా తీసుకుంటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందని సూచిస్తున్నారు.

బరువు తగ్గాలనుకునే వారు కూడా మెంతి ఆకులను తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. ఒక కప్పు మెంతి ఆకులలో 13 కేలరీల శక్తి ఉంటుంది. వీటిని తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గడంలో మెంతులు ప్రధాన భూమిక పోషిస్తాయి.