https://oktelugu.com/

Coconut Flower: కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందా? దాన్ని ఏం చేయాలో తెలుసా?

కిరాణ షాపుల్లో దొరికే కొబ్బరి కాయలో నీళ్లు ఇంకి పోయిన తరువాత కొబ్బరి పువ్వుగా ఏర్పడుతుంది. ఇది అన్ని టెంకాలయల్లో లభిస్తుందని అనుకోలేం.

Written By:
  • Srinivas
  • , Updated On : August 19, 2023 4:13 pm
    Coconut Flower

    Coconut Flower

    Follow us on

    Coconut Flower: కొబ్బరి కాయ గురించి తెలుసు.. కొబ్బరి బొండాం గురించి తెలుసు.. కానీ కొబ్బరి పువ్వు గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కొబ్బరి కాయ పగలగొట్టినప్పుడు అందులో చిన్న పదార్థం కనిపిస్తే ‘కొబ్బరి పువ్వు’ వచ్చింది.. ఇప్పుడంతా మంచే జరుగుతుందని అంటారు. ఆ తరువాత కొందరు ఆ కొబ్బరి పువ్వును తింటారు..మరికొందరు మాత్రం దైవానికి సమర్పిస్తారు. అయితే కొబ్బరి పువ్వుపు ఇప్పుడు కొందరు ప్రత్యేకంగా పండిస్తున్నారు. వాస్తవానికి కొబ్బరి పువ్వు ఆటోమేటిక్ గా టెంకాయలో వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా పండించి విక్రయిస్తున్నారు. ఎందుకంటే కొబ్బరి పువ్వులో రోగ నిరోధక శక్తితో పాటు అనేక రోగాలను రాకుండా చేస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం..

    కిరాణ షాపుల్లో దొరికే కొబ్బరి కాయలో నీళ్లు ఇంకి పోయిన తరువాత కొబ్బరి పువ్వుగా ఏర్పడుతుంది. ఇది అన్ని టెంకాలయల్లో లభిస్తుందని అనుకోలేం. అందువల్ల కొందరు రైతులు ప్రత్యేకంగా పండిస్తున్నారు. కొబ్బరికాయలు భూమిలో పాతి పెట్టిన తరువాత కొన్నాళ్లకు కొబ్బరిలో ఉండే నీళ్లు మొత్తం పువ్వుగా మారుతుంది. వీటిని నేరుగా తినొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్య కొందరు వీటిని ఒక్కోటి రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు.

    శరీరంలోని రక్తంలో చక్కెరస్థాయిలను అదుపు చేయడంతో కొబ్బరి పువ్వు ఉపయోగపడుతుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు కొబ్బరిపువ్వు దొరికిన వెంటనే తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టిరయిల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్న జీవి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

    కొబ్బరిపువ్వులో ఫ్రీ రాడికల్స్ ను తొలగించే గుణం ఉండడంతో క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను తొలగిస్తుంది. థైరాయిడ్ తో బాధపడేవారు సైతం దీనిని తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఇక జుట్టును నల్లగా ఉండాలని కోరుకునేవారు సైతం కొబ్బరి పువ్వును తింటే మంచిదని అంటున్నారు. అయితే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తరువాత తీసుకోవడం మంచిది.