David Warner: ఈ ఏడాది ఐపీఎల్ వేలం ఎలా ఉండబోతున్నదని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, రాబోయే ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను తీసుకోవడానికి ఏ ప్రాంచైజీలు ముందుకు వస్తాయనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా ఉంది. డేవిడ్ వార్నర్ ను కెప్టెన్ గా తీసుకోవడానికి పలు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయని వార్తలొస్తున్నాయి. కానీ, అందులో నిజమెంత ఉందనేది తెలియాలంటే మెగా వేలయం అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

ఇకపోతే డేవిడ్ వార్నర్ గతేడాది ఐపీఎల్‌లో సరిగా పర్ఫార్మ్ చేయలేదు. దాంతో సనర్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తొలుత డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఆపై జట్టు నుంచి పక్కకు పెట్టి ఘోరంగా అవమానించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ లోనూ వార్నర్ పేరు లేదు. ఈ క్రమంలోనే అతను వేలం పాటలో పాల్గొంటారని తెలుస్తోంది.

Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలంలో ఎవరికి ఎంత రేటు? ఎంత మందంటే?
ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా తీసుకోవడానికి పలు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయనే క్రికెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇకపోతే డేవిడ్ వార్నర్ కు వేలం పాటలో భారీ దర పలుకుతాడని మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తెలిపాడు. అయితే, డేవిడ్ వార్నర్ ను కెప్టెన్ గా తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ముందుకొస్తాయా? అనేది చర్చనీయాంశంగా ఉంది. పలు ఫ్రాంచైజీలు డేవిడ్ వార్నర్ ను తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ కెప్టెన్ గా తీసుకోవడానికి ఆలోచిస్తాయని ఈ సందర్భంగా చోప్రా అంటున్నారు. కెప్టెన్సీ పరంగా డేవిడ్ వర్నార్ కు ఉన్న అవకాశాల గురించి ఫ్రాంచైజీలు పరిశీలన చేస్తాయి.
నిజానికి డేవిడ్ వార్నర్ గతేడాది ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శనే ఇచ్చాడు. మొత్తం ఎనిమిది మ్యాచుల్లో 195 పరుగులే చేశాడు. దుబాయ్ లో జరిగిన రెండో దశ సీజన్‌లో పెద్దగా ఆడలేదు. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్ లో ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఆసీస్ బ్యాట్స్‌మన్ వచ్చే సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా నియమితమవుతాడని కొందరు క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: IPL New Sponsor: ఐపీఎల్ లో కీలక పరిణామాలు.. టాటా గ్రూప్ కు స్పాన్సర్ బాధ్యతలు