Dangerous Smartphone Apps: ఆన్ లైన్ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమాయకులు మోసపోతూనే ఉన్నారు. ఏవో కారణాలతో తమ ఖాతాలోని నగదు నిల్వలు మాయం అవుతూనే ఉన్నాయి. ఏవో యాప్ లు చూపించి సంపదను దోచేస్తున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. దీంతో తమ డబ్బును బ్యాంకులో దాచుకున్న ఆన్ లైన్ మోసాలతో ఏం చేయాలో తెలియడం లేదు. తమ డబ్బులు నిమిషాల్లో మాయమవడంపై ఫిర్యాదు చేసినా అది ఎక్కడో ఉండటంతో ఏం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ మోసాల గురించి ఎంత అధ్యయనం చేసినా నిందితులను మాత్రం పట్టుకునే అవకాశాలు చిక్కడం లేదు.

ఇటీవల స్మార్ట్ ఫోన్లలోని ప్లే స్టోర్ లోకి కొత్త కొత్త యాప్ లు వస్తున్నాయి. దీంతో వీటితో ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. సుమారు 35రకాల యాప్స్ రావడంతో వాటిని మనం పొరపాటున క్లిక్ చేస్తే మన డబ్బులు క్షణాల్లో మాయం కావాల్సిందే. సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ బిట్ రిఫెండర్ హెచ్చరిస్తోంది. మీ ఫోన్ లో ఆ యాప్స్ ఉంటే తక్షణమే తొలగించుకోవాలని సూచిస్తోంది. వీటితో భవిష్యత్ లో కూడా ముప్పేనని స్పష్టం చేస్తోంది. అవి మన ప్లే స్టోర్ లో ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేస్తేనే మనకు ప్రయోజనం ఉంటుందని తెలుసుకోవచ్చు.
ఇవి మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశముంది. ఈ యాప్ ల్లో బిగ్ ఎమోజీ, ఆర్ట్ ఫిల్టర్, స్మార్ట్ వైఫై, మై జీపీఎస్ లొకేషన్, స్మార్ట్ క్యూఆర్ క్రియేటర్, స్లీప్ సౌండ్స్ తదితర యాప్స్ ఉన్నాయి. దీంతో మన భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మన ప్లే స్టోర్ లో ఉన్న యాప్ లను తొలగించుకునేందుకు సిద్ధం కావాల్సిందే. వాటిని అక్కడి నుంచి ఆ యాప్ లను తీసేసేందుకు నిర్ణయించుకుని వాటని ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేయాల్సిందే. లేకపోతే మన డబ్బులు దొంగించే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇందులో ఆన్ లైన్ మోసాలు విపరీతంగా చోటుచేసుకుంటున్నాయి. దొంగ యాప్ లతో జనాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తుంటాయి. దీంతో మన జేబులు గుళ్ల కావాల్సిందే. డబ్బులను జాగ్రత్తగా చూసుకోవాలి. పొరపాటున కూడా ఎలాంటి తప్పు చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. దీంతో యాప్ లను ఉంచుకోకుండా తీసేసి మనకు జరిగే నష్టాలను దూరం చేసుకోవాలని సూచిస్తున్నారు.