Karthikeya 2 Collections: ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ 2’ రిలీజ్ కి ముందు చాలా కష్టాలు ఎదుర్కొంది. కానీ రిలీజ్ తర్వాత మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తోంది. నిఖిల్ చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. మరీ బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ సక్సెస్ ఏ స్థాయిలో ఉంది ?, అసలు ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, ఇంతకీ నిర్మాతకు లాభాలు వస్తాయా ? చూద్దాం రండి.

ముందుగా ‘కార్తికేయ 2’ సినిమా 7 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 2.39 కోట్లు
సీడెడ్ 1.48 కోట్లు
ఉత్తరాంధ్ర 1.33 కోట్లు
ఈస్ట్ 0.95 కోట్లు
వెస్ట్ 0.96 కోట్లు
గుంటూరు 1.19 కోట్లు
కృష్ణా 1.08 కోట్లు
నెల్లూరు 0.76 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 7 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘కార్తికేయ 2’ రూ. 7.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 14.29 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.90 కోట్లు
ఓవర్సీస్ 3.15 కోట్లు
హిందీ మరియు ఇతర వెర్షన్లు 0.81 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 7 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘కార్తికేయ 2’ రూ. 15.32 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 30:64 కోట్లను కొల్లగొట్టింది.

కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అయినట్టే. నిజానికి ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు. అయితే, ‘కార్తికేయ 2’ కోసం ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ దగ్గర కనిపించారు. మొత్తానికి నిఖిల్ బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబట్టాడు.
Also Read:Vyjayanthi Movies: వైజయంతీ మూవీస్ వరుస హిట్స్ వెనుక ఉన్న మేథ ఎవరిది?


[…] […]
[…] […]