Curd : ప్రతిరోజు భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు కొందరు. భోజనంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా పెరుగును వాడుతూ ఉంటారు. పెరుగు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి పెరుగు మాత్రమే మంచి ఔషధమై కొందరు భావిస్తారు. అయితే ప్రస్తుతం అంతా కల్తీమయం కావడంతో మార్కెట్లో దొరికే పెరుగు కూడా నాణ్యమైనది లేదని కొందరు అంటున్నారు. ఈ క్రమంలో పెరుగును ఇంట్లోనే తయారు చేసుకోవాలని చెబుతున్నారు. పూర్వకాలంలో ఇంట్లో తయారుచేసిన పెరుగు ఎంతో రుచికరంగా ఉండేది. అంతేకాకుండా ఇందులో అత్యధిక ప్రోటీన్లు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు సమయం లేకపోవడం వల్ల చాలామంది ఇంట్లో పెరుగు తయారు చేసుకోవడం లేదు. కానీ కాస్త సమయం కేటాయిస్తే ఇంట్లోనే ఆరోగ్యకరమైన పెరుగును తయారు చేసుకోవచ్చు. అయితే ఈ పెరుగును తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే?
Also Read : ఇలాంటి పుచ్చకాయలు తింటే విషం తిన్నట్టే..
పెరుగు తయారు చేయడం చాలా తేలిక అని కొందరు అనుకుంటారు. కానీ చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఈ పెరుగు విషపూరితంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా పాలలో తోడు వేయడం వల్ల పెరుగు తయారవుతుంది. కానీ సమయానికి పెరుగు లేకున్నా కూడా కొన్ని పదార్థాలతో తోడు వేసుకోవచ్చు.పాలు వేడి చేసిన తర్వాత సమయానికి పెరుగు లేకపోవడంతో అందులో కాస్త చింతపండు వేసి 12 గంటల పాటు వేచి ఉండడం వల్ల పెరుగు తయారవుతుంది. అలాగే ఎండుమిర్చిని వేసి 12 గంటల పాటు నిల్వ ఉంచిన పెరుగు తయారవుతుంది.
పెరుగు తయారు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పెరుగును రాగి పాత్రలో తయారు చేసుకోవద్దు. అంటే రాగి పాత్రలో వేడిపాలు నిల్వ ఉండడం వల్ల ఇందులో రసాయనక చర్యలు జరిగే అవకాశం ఉంది. దీంతో పెరుగు విషపూరితంగా మారుతుంది. అలాగే ఇత్తడి పాత్రలోనూ పెరుగు ఉంచవద్దు. కొందరి ఇండ్లలో ఇప్పటికీ ఇత్తడి పాత్రలు కనిపిస్తాయి. వీటిలో పెరుగును నిల్వ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల పెరుగు విషపూరితంగా మారుతుంది. అందువల్ల ఈ పాత్రలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు.
అయితే పెరుగు తయారు చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్ లాంటి పాత్రలను ఉపయోగించాలి. అందుబాటులో మట్టి పాత్రలో ఉంటే ఇంకా మంచిది. మట్టి పాత్రలో పెరుగును తయారు చేయడం వల్ల నీరు వెళ్లిపోయి నిజమైన పెరుగు ఉండి రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పెరుగుకు మట్టిలోని బ్యాక్టీరియా తోడై మరింత శక్తిని ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పెరుగును తయారు చేసేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి పెరుగును వేసవికాలంలో తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. పెరుగు షర్బత్ తాగడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. ఉదయం పెరుగు షర్బత్ తాగి ఎండకు వెళ్లిన ఎలాంటి నష్టం ఉండదు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు పెరుగు వాడక విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. లేకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది.