https://oktelugu.com/

Credit Card Bill: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడానికి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదా… అయితే ఇలా చెల్లించండి…

చేతిలో పైసా లేని సమయంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులను కొనుక్కోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డులు ఉపయోగపడుతున్నాయి. దీంతో చాలామంది క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 30, 2023 / 06:11 PM IST

    Credit Card Bill

    Follow us on

    Credit Card Bill: నేటి కాలంలో అవసరానికి తగ్గట్టుగా ఆదాయం రావడం లేదు. దీంతో అప్పులు చేయాల్సి వస్తుంది. అయితే కరోనా తర్వాత అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే అప్పులు తీసుకున్నవారు తిరిగి ఇచ్చేటప్పుడు ఇబ్బందులు పెడుతున్నారు. అయితే బ్యాంకులు మాత్రం క్రెడిట్ కార్డు రూపంలో ఖాతాదారులకు పరోక్షంగా అప్పులు ఇస్తున్నాయి. తమ వస్తు సేవల వినియోగానికి క్రెడిట్ కార్డు ద్వారా సాయం చేస్తున్నాయి. కరోనా తర్వాత క్రెడిట్ కార్డ్ ద్వారా నెలకు కనీసం రూ.16 వేలు వినియోగిస్తున్నారని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు వేసింది. ఈ తరుణంలో క్రెడిట్ కార్ల వినియోగం తగ్గించాలని బ్యాంకులకు ఆదేశాలు పంపింది. అయితే క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు ఉన్న సంతోషం దాని బిల్లు చెల్లించేటప్పుడు వినియోగదారుల్లో ఉండడం లేదు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించే సమయానికి చేతిలో పైసా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బిల్లును గడువులోగా చెల్లించకపోతే బ్యాంకులు భారీ వడ్డీ విధిస్తాయి. అంతేకాక సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.

    చేతిలో పైసా లేని సమయంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులను కొనుక్కోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డులు ఉపయోగపడుతున్నాయి. దీంతో చాలామంది క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు. బ్యాంకులు ఖాతాదారుల ట్రాన్సాక్షన్ ను దృష్టిలో పెట్టుకొని నేరుగా వారికి ఫోన్ చేసి ఉచితంగానే క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. వినియోగదారులు సైతం తమకు ఉపయోగపడేలా ఉండడంతో ఒకటికి మించి క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ బిల్లు ఆ బిల్లు గడువు తేదీలోగా చెల్లించేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లు చెల్లించే సమయానికి డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

    ప్రతినెల 16వ తేదీన క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అవుతుంది అయితే ఆ లోపు వస్తు సేవల కు సంబంధించిన బిల్లును నెక్స్ట్ మంత్ 5వ తేదీ నాడు చెల్లించాల్సి ఉంటుంది ఈ క్రమంలో 16 నుంచి 5 లోపు మరో క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ తీసుకొని అప్పటి వరకు వాడిన క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించవచ్చు. పేటీఎం, క్రెడ్ ఆఫ్ అనే యాప్ ల ద్వారా అడ్వాన్స్ అమౌంట్ తీసుకొని క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించవచ్చు. అయితే ఇలా తీసుకోవడం వల్ల మినిమం వడ్డీ పడుతుంది. కానీ గడువుతేదీ లోగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడం వల్ల అధిక వడ్డీ నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా సిబిల్ స్కోర్ ను కాపాడుకోవచ్చు. అందువల్ల గడువు తేదీ దాటకుండా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించే ప్రయత్నం చేయండి