Chiranjeevi Family Man Story: స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ హీరో చిరంజీవి కోసం రాసిందంటూ షాకింగ్ మేటర్ బయటపెట్టారు. 2019లో అమెజాన్ ఒరిజినల్ గా విడుదలైన ది ఫ్యామిలీ మాన్ సిరీస్ భారీ సక్సెస్ సాధించింది. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన రోల్ చేయగా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. హీరోయిన్ ప్రియమణి భార్య పాత్ర చేశారు. మనోజ్ బాజ్ పాయ్ అండర్ కవర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర చేశాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాన్ గా అలరించారు.
సీజన్ వన్ సక్సెస్ కావడంతో సీజన్ 2 చేశారు. సీజన్ 2లో సమంత ప్రధాన పాత్ర చేసింది. మనోజ్ పాజ్ పాయ్ మరోసారి తన పాత్రలో నటించారు. సీజన్ 2 సైతం ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకుంది. సమంతకు బాలీవుడ్ లో మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది ఈ సిరీస్. అయితే ది ఫ్యామిలీ మాన్ స్క్రిప్ట్ రాజ్ అండ్ డీకే చిరంజీవి కోసం రాశారట. నిర్మాత అశ్వినీ దత్ నిర్మించాల్సి ఉందట.
ఖైదీ నెంబర్ 150 మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చిన చిరంజీవి భారీ సక్సెస్ అందుకున్నారు. అప్పుడే రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మాన్ సిరీస్ స్క్రిప్ట్ ఆయనకు చెప్పారట. భార్య పిల్లలున్న మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్ పట్ల చిరంజీవి ఆసక్తి చూపలేదట. కావాలంటే మార్పులు చేద్దాం, పిల్లలు పాత్రలు లేపేద్దాం అని చెప్పారట. అయినప్పటికీ చిరంజీవి ఆసక్తి చూపలేదట. ది ఫ్యామిలీ మాన్ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారట.
ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో సీ అశ్వినీదత్ స్వయంగా చెప్పారు. ఆయన చేసి ఉంటే ది ఫ్యామిలీ మ్యాన్ ఇంకా భారీ హిట్ అయ్యేదని అన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చిరంజీవి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారని అంటున్నారు. చిరంజీవి ఆ స్క్రిప్ట్ ఓకే చేసి ఉంటే ఒక మంచి ప్రాజెక్ట్ ఆయనకు దక్కేదని అంటున్నారు. మొత్తంగా ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక భోళా శంకర్ రిజల్ట్ నేపథ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
Chiranjeevi rejected Family Man..
Chesi unte.. Megastar level maro level lo undedi anthe.. @KChiruTweets @AswiniDutt #FilmNews #thefamilyman #rajanddk pic.twitter.com/rHR8McEMJD— roja pantham (@roja_pantham) August 30, 2023