Cracked Heels: శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. చలికాలంలో జలుబు, దగ్గుతో పాటు ఇతర రోగాలు కూడా వ్యాపిస్తాయి. అందుకే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చలి నుంచి రక్షణ పొందటానికి కూడా స్వెటర్లను వాడుకోవాల్సిందే. ఇలా చలికాలంలో మనకు అనేక రకాల సమస్యలు రావడం సహజమే. ఇందులో పాదాల పగుళ్లు కూడా ఒకటి. చలికాలం వచ్చిందంటే చాలా మందికి పాదాల కింద పగుళ్లు ఏర్పడుతుంటాయి. దీంతో పాదాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ పాదాల పగుళ్లకు మందులు వాడి దాని నుంచి పరిష్కారం పొందేందుకు ప్రయత్నించాలి.

చలికాలంలో పొడి చర్మం ఇబ్బందులు పెడుతుంది. చర్మం పాలిపోయినట్లుగా ఉంటుంది. పాదాల పగుళ్ల నుంచి రక్షణ పొందడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు పావు కప్పు కొబ్బరినూనెలో రెండు చుక్కల లవంగ నూనె కలిపి పాదాలకు బాగా రాసుకోవాలి. దీంతో పాదాల పగుళ్లు రాకుండా ఉంటాయి. రక్తప్రసరణ సరిగా జరిగి నొప్పులు కూడా రాకుండా ఉంటుంది. ప్రతి రోజు ఇలా చేస్తుంటే పాదాల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
నువ్వుల నూనె, రెండు చెంచాల పెసరపిండి, కొంచెం పెరుగు కలిపి పాదాలకు మర్దన చేస్తే కూడా ఫలితం ఉంటుంది. తరువాత బ్రష్ తో మరోసారి రాయాలి. దీంతో పాదాల మీద ఉండే మృత కణాలు తొలగిపోయి మనకు ఇబ్బందులురాకుండా ఉంటుంది. చర్మం మృదువుగా అవుతుంది. తేమ కూడా రాదు. దీంతో పాదాల పగుళ్లకు చక్కని పరిష్కార మార్గంగా దీన్ని వాడుకోవచ్చు. పాదాల పగుళ్లు ఉంటే నడుస్తుంటే నొప్పి కూడా రావడం సహజమే. అందుకే పాదాల పగుళ్లు రాకుండా చూసుకునేందుకు ఇలాంటి పద్ధతులు పాటిస్తే సరిపోతుంది.

కొన్ని గులాబీ రేకులు, రెండు తులసి కొమ్మలు, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ నీళ్లలో వేసి మరిగించాలి. గోరువెచ్చగా అయ్యాక అందులో పాదాలు ఉంచాలి. తరువాత ఫ్యూమిక్ స్టోన్ తో రుద్దితే చర్మం కాంతివంతంగా మారుతుంది. దీంతో పాదాల పగుళ్లు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా త్వరగా పోతాయి. ఇలా పైన సూచించిన విధంగా చిట్కాలు పాటిస్తే మనకు ఎలాంటి ఇబ్బందులు దరిచేరవు. సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాదాల పగుళ్లకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. ఇవి పాటించి మన అనారోగ్యాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.