Coronavirus in India: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే మూడు దశల్లో ప్రజలను అతలాకుతలం చేసిన మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. జనాన్ని అస్తవ్యస్తం చేయడానికి రెడీ అవుతోంది. నాలుగో దశ ప్రారంభమైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ మొదటి పరిస్థితి వస్తుందేమోననే సందేహాలు కూడా వస్తున్నాయి. మొదటి దశలో పరిస్థితులకు ప్రపంచమే కుదేలైపోయింది. లాక్ డౌన్ విధించి మూడు నెలలు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రస్తుతం కూడా అవే ఛాయలు కనిపిస్తున్నాయి.

రోజువారి కేసుల సంఖ్యలో పెరుగుదల భయపెడుతోంది. రాష్ర్టంలో పాజిటివిటీ రేటు పరేషాన్ చేస్తోంది. గురువారం కంటే శుక్రవారం నమోదైన కేసులు ఎక్కువగా ఉండటంతో మెల్లగా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందనే ఆందోళన కలుగుతోంది. ప్రస్తుతం ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి మరోమారు జడలు విప్పనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Amarnath Yatra- MLA Raja Singh: అమర్ నాథ్ యాత్రలో పెను ప్రమాదం.. ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏమైంది?
రోజువారీ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరికి వారే వ్యక్తిగత శుభ్రత పాటించి వైరస్ ను కట్టడి చేయాలని కోరుతున్నారు. పరిస్థితి చేయిదాటిపోతే దారుణంగా ఉంటుంది. అందుకే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. దీంతో కరోనా వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్రంలో వైరస్ దాడిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచిస్తున్నారు.

కరోనా కేసుల్లో హైదరాబాద్ ముందంజలో ఉండగా రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి తరువాత స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఆందోళనకర పరిస్థితులను అదుపులో ఉంచే క్రమంలో అధికారులు మల్లగుళ్లాలు పడుతున్నారు. ప్రభుత్వమే దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తాము అమలు చేస్తామని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నిండా మునిగేదాకా తన నిర్ణయం ప్రకటించదు. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. కేసుల పురోగతి చూస్తుంటే బాధ కలుగుతోంది. భారీ వర్షాలకు తోడు వైరస్ దాడితో రాష్ట్రం భవిష్యత్ ఏమవుతుందోననే ఆందోళన అందరిలో కలుగుతోంది.
Also Read:ETV Mallemala: డబ్బే కాదు…ఆర్టిస్టులకు అభిమనమూ ముఖ్యమే! అదిలేకే మల్లెమాల నుంచి వలసలు