Cool Trip In Summer : వేసవి రాగానే చాలామంది చల్లని వాతావరణాన్ని కోరుకుంటారు. ఇదే సమయంలో సెలవులు కూడా రావడంతో చాలామంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. అయితే చల్లటి ప్రదేశానికి వెళ్లి హాయిగా ఉండాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్ వెళ్లి ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఇక్కడికి వెళ్లాలంటే కాస్త ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇదే అనుభూతిని ఇప్పుడు తెలంగాణలో కూడా పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో కూడా వేసవి సమయంలో చల్లటి ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో గొట్టం గుట్ట గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ వేసవి సమయంలో చల్లటి వాతావరణాన్ని పొందవచ్చు అని అంటున్నారు. మరి ఈ ప్రదేశానికి ఎలా వెళ్లాలి? ఇది ఎక్కడ ఉంది? ఆ వివరాల్లోకి వెళ్తే.
Also Read : న్యూ ఇయర్ కి ఎక్కడికి వెళ్లాలి అని ప్లాన్ చేస్తున్నారు? ఈ ట్రిప్ కు వెళ్లండి.
గొట్టం గుట్ట గురించి చాలామందికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఇది కాస్త మారుమూల ప్రాంతంలోనే ఉంటుంది. కానీ సినిమా షూటింగ్ లు ఇక్కడ చాలా వరకు జరిగాయి. అయితే ఇక్కడ వసతి సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల ఇది పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందలేదు. కానీ ఇక్కడికి వెళ్లి మధురానుభూతి పొందవచ్చు అని ఇక్కడికి వెళ్లినవారు అంటున్నారు. గొట్టం గుట్ట తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడికి ఎలా వెళ్లాలంటే?
తెలంగాణలోని జహీరాబాద్ నుంచి గొట్టం గుట్టకు వెళ్ళచ్చు. హైదరాబాదు నుంచి ఇక్కడికి వెళ్లాలంటే 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ జహీరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. అయితే జహీరాబాద్ నుంచి ఇక్కడికి వెళ్లి తిరిగిలా రావాలి. ఎందుకంటే గొట్టం గుట్ట వద్ద ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ ఇక్కడికి వెళ్లిన వారికి ఒక ప్రత్యేక లోకంలోకి వెళ్లినట్లు అవుతుంది. ఎటుచూసినా పచ్చదనంతో కనిపిస్తుంది. అంతేకాకుండా గుట్టల మధ్య చల్లటి వాతావరణం లో ప్రయాణం చేయడం వల్ల హాయిగా ఉంటుంది. ఇక్కడికి వస్తే అసలు వేసవికాలం ఉందా? లేదా అని అనుమాన పడుతూ ఉంటాం.
గొట్టం గుట్ట వరకు వెళ్లాలంటే కాస్త సాహసం చేయాల్సిందే. ఎందుకంటే నిర్మానుషంగా ఉన్న ఈ ప్రాంతం కాస్త సైలెంట్ గా ఉంటుంది. కానీ పెద్ద ఫ్యామిలీతో వెళ్లినవారు చాలా ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాకుండా పిక్నిక్ స్పాట్గా కూడా ఇది ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడికి ఎలాంటి వాహన సౌకర్యాలు లేనందున.. ప్రత్యేకంగా వెహికిల్ తీసుకొని వెళ్లాలి. ప్రకృతి వాతావరణం లో మైమర్చి పోవాలంటే ఇది ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తుంది.
సాధారణంగా ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలని అనుకునేవారు.. తక్కువ ఖర్చులో ఇక్కడికి వెళ్లి అదే రకమైన అనుభూతిని పొందవచ్చు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఇక్కడికి వెళ్లి రావడంతో ఉల్లాసంగా ఉంటుంది. అయితే జహీరాబాద్ లో ప్రత్యేకంగా వసతిగృహం తీసుకొని గోట్టం గుట్టకు వెళ్లాలి. ఆ తర్వాత ఇక్కడికి చేరుకొని వసతిని పొందాలి. అయితే జహీరాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కూడా వెళ్లొచ్చు. అయితే ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలని కొందరు కోరుతున్నారు.
Also Read : గోవా ట్రిప్ ప్లాన్ చేశారా? ఇది మీకోసమే..