Trip : ప్రతి సారి న్యూ ఇయర్ కు ఎటైనా వెళ్లాలి అని ప్లాన్ చేసుకొని మళ్లీ క్యాన్సల్ అవుతున్నారా? కానీ ఈ సారి అలా అవకండి. మంచి ట్రిప్ ను ప్లాన్ చేసుకోండి. చలి ఉంది కదా అని భయపడవద్దు. ఒక మంచి ఎక్సపరిమెంట్ చేయడం వల్ల ఎప్పుడు కూడా ఈ ట్రిప్ గుర్తిండిపోతుంది. అందుకే ఈ సంవత్సరం భారతదేశంలో చిరస్మరణీయమైన నూతన సంవత్సర వేడుకల కోసం వినోదభరితమైన ప్లేస్ ను ఎంచుకోండి. నమ్మలేని ప్రకృతి దృశ్యాలు, మంచుతో కప్పిన పర్వతాల మధ్య మనోహరమైన అనుభవాలు, సముద్రంలో మునిగి తేలే కొత్త సాహసాలను ఆస్వాదిస్తూ ఈ న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయండి. న్యూ ఇయర్ సందర్భంగా సరైన విహారయాత్ర కోసం భారతదేశంలోని ఐదు ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి అవేంటో కూడా తెలుసుకోండి.
గోవా కు వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే ఇక్కడి అద్భుతమైన బీచ్‌లు, మంచి క్లబ్‌లతో మీ సెలబ్రేషన్ కు మంచి కిక్ ను అందించండి. పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకలతో నూతన సంవత్సర సెలవుదినానికి సరైన విహారయాత్రను అందిస్తుంది మీకు గోవా. మరి ఇంకెందుకు ఆలస్యం జర ప్లాన్ చేసుకోండి.
హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన మనాలి కూడా మీకు సూపర్ స్పాట్. ప్రశాంతమైన వాతావరణం, మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య రిలాక్స్‌డ్ న్యూ ఇయర్ సెలవులకు సరైన ప్రదేశం ఈ మనాలి. మరి ఈ న్యూ ఇయర్ ను ఇక్కడ ఎంజాయ్ చేసేయండి.
ఉదయపూర్ నూతన సంవత్సర సెలవులకు మంచి స్పాట్. ప్రత్యేకించి అక్కడ ఉండే అద్భుతమైన సరస్సులు, రాజభవనాలు పండుగ వాతావరణంతో నిండి ఉంటాయి. విలాసవంతమైన సాంప్రదాయిక అనుభవాన్ని పొందాలనుకునే వారికి సరైన విహారయాత్ర ఈ ఉదయపూర్.
గుల్మార్గ్, మంచుతో కప్పబడిన పర్వతాలతో కూడిన శీతాకాలపు అద్భుత ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన ప్రకృతి దృశ్యాల మధ్య న్యూ ఇయర్ పార్టీలకు ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. మీకు మంచి ఆసక్తిని కూడా రేకెత్తిస్తుంది. శీతాకాలం లో ట్రిప్ ప్లాన్ చేసుకునే చాలా మంది ప్రకృతి ప్రేమికులకు ముందుగా గుర్తొచ్చే ప్రాంతం ‘కశ్మీర్’. ఇక ఈ చలికాలంలో మంచు దుప్పటిలో కూరుకుపోయి.. కశ్మీర్ లోయ అందాలు మరింత పెరుగుతాయి. ఈ గుల్మార్గ్ కూడా అక్కడే ఉంది. ఈ సమయంలోనే టూరిస్ట్ ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. వీటిల్లో ముఖ్యమైనది గుల్మార్గ్. శీతాకాలంలో ఈ ప్రాంతం అందాలు రెట్టింపు అవుతాయి.
పుదుచ్చేరి ఫ్రెంచ్ కలోనియల్ ఆర్కిటెక్చర్, నిర్మలమైన బీచ్‌లు, వైబ్రెంట్ బీచ్ పార్టీల ప్రత్యేక సమ్మేళనానికి ప్రసిద్ధి చెందింది. ఇది నూతన సంవత్సర అనుభూతిని పొందాలనుకునే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మరో మంచి ప్లేస్ ఉంది. పుదుచ్చేరిలో ఉండే వినాయకుడి ఆలయం చాలా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ఏనుగులు ప్రజల నుంచి నాణేలు తీసుకుని వారిని ఆశీర్వదిస్తుంటాయి.