Constipation Problem: మలబద్ధకం సమస్యలకు ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..

ఇంట్లో రుచి లేదంటూ కొందరు బయట తిండికి అలవాడుపడుతున్నారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్లలో ఉండే ఫుడ్ తో జబ్బుల బారిన పడుతున్నారు.

Written By: Chai Muchhata, Updated On : February 1, 2024 4:03 pm

Constipation Problem

Follow us on

Constipation Problem: నేటి కాలంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు కారణం ప్రణాళిక లేకుండా ఆహారాన్ని తినడమే. ఇంట్లో రుచి లేదంటూ కొందరు బయట తిండికి అలవాడుపడుతున్నారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్లలో ఉండే ఫుడ్ తో జబ్బుల బారిన పడుతున్నారు. నేటి కాలంలో చాలా మందికి వేధిస్తున్న సమస్య మలమద్ధకం. వేయించిన ఫుడ్, తదితర జీర్ణం కాని ఆహారం తినడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అయితే ముందు జాగ్రత్తగా ఈ సమస్య రాకుండా కొన్ని చిట్కాలు పాటించాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ చిట్కాలేంటంటే?

మనిషి నిత్య ఆరోగ్యానికి నీరు చాలా అవసరం. కేవలం దాహం వేసినప్పుడు మాత్రమే కాకుండా క్రమ పద్ధతిలో నీరు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా యవ్వనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి మలిన పదార్థాలు ఉన్నా చెమట ద్వారా బయటికి నీరు పంపుతుంది. అయితే చాలామంది పని ఒత్తిడి కారణంగా నీరు తాగడానికి ఇష్టపడరు. దీంతో కడుపులో ఆహారం జీర్ణం కాకుండా కొవ్వులాగా పేరుకుపోతుంది. దీంతో మోషన్ ఫ్రీ ఉండదు. అందువల్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. వేసవిలో మరింత ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

మార్కెట్లోకి వెళ్లగానే కూరగాయలు మాత్రమే తీసుకుంటాం. చాలా మంది పండ్లు కొనేందుకు ఆసక్తి చూపరు. కానీ పండ్లల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు, పోషకాలతో ఆహారం జీర్ణం కావడానికి ఎంతో ఉపకరిస్తుంది. భోజనం చేసిన అరగంట తరువాత ఏదేని ఒక పండు తినడంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది.

నేటి కాలంలో ఇంట్లో ఫుడ్ ఎవరికీ రుచి ఉండడం లేదు. దీంతో చిరు తిళ్లకు బాగా అలవాడుపడిపోయారు. హోటళ్లు, రెస్టారెంట్లలో టేస్టీ ఫుడ్ లభించడంతో వాటిపై మక్కువ చూపుతున్నారు. అయితే ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా వీటిని తిన్నా చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల నయమవుతుంది.