Common Yoga Mistakes: ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది ప్రపంచం. అయితే ప్రస్తుతం ఈ వేగవంతమైన జీవితంలో, ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మంచి జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రజలు యోగా చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే బిజీ జీవనశైలి కారణంగా ప్రజలు తమను తాము శ్రద్ధగా చూసుకోలేకపోతున్నారు.
మీరు శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు మీ లైఫ్ లో యోగాను ఒక పార్ట్ గా మార్చుకోండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే యోగా చేసే ముందు మీకు కొంత సమాచారం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. యోగా చేస్తున్నప్పుడు, మీరు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. చేస్తే యోగా వల్ల వచ్చే ప్రయోజనాల కంటే మీ శరీరం మరింత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
2025 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న జరుపుకుంటున్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వేడుక జరుగుతుంది. మీరు యోగా చేస్తుంటే ఈ వార్త మీకు ముఖ్యమే. యోగా చేసే ముందు మీరు కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. అవేంటంటే?
ఖాళీ కడుపుతో యోగా చేయడం: యోగా చేసేటప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండటానికి యోగా చేయడానికి కనీసం 2-3 గంటల ముందు ఏమీ తినకండి.
తొందరపడి యోగా చేయడం: యోగా నెమ్మదిగా, సరిగ్గా చేయాలి. తొందరపడి యోగా చేయడం వల్ల మీకు గాయం కావచ్చు.
వామప్స్: యోగా ప్రారంభించే ముందు వామప్స్ చేయడం కూడా చాలా అవసరం. ఇది శరీరాన్ని యోగాకు సిద్ధం చేస్తుంది.
Also Read: Yoga Day Rules In Vizag: విశాఖ యోగా డేకు నిబంధనలు ఎంత కఠినం అంటే?
సరైన గైడ్: కష్టమైన యోగా భంగిమలు చేసే ముందు, అనుభవజ్ఞుడైన యోగా శిక్షకుడి నుంచి మార్గదర్శకత్వం తీసుకోవాలి. లేదంటే మీకు ఇవి మరింత సమస్యలను తెచ్చిపెడతాయి.
సౌకర్యవంతమైన దుస్తులు: యోగా చేస్తున్నప్పుడు, శరీరం సులభంగా వంగగలిగేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి.
ఎక్కువ నీరు తాగడం: యోగా మధ్యలో ఎక్కువ నీరు తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది కడుపు నొప్పికి కారణం కావచ్చు.
యోగా చేసిన వెంటనే తినడం: యోగా చేసిన వెంటనే ఏమీ తినకుండా ఉండండి. కనీసం 30 నిమిషాల విరామం తీసుకోండి.
సొంత యోగా: సొంతంగా మీరు యోగా చేస్తే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ కండరాలకు సమస్య వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్త.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.