Rajamouli Tourist Family: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ లో నార్త్, సౌత్ అంటూ తేడాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి బేధాలు ఏమి లేవు…ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఎవరు ఏ సినిమా చేసినా కూడా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందువల్లే ఇప్పుడొచ్చే దర్శకులు సైతం పాన్ ఇండియా సబ్జెక్టులను సినిమాలుగా ఎంచుకొని మంచి విజయాలను సాధిస్తున్నారు…
Also Read: యోగా వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎందుకు చేయాలి?
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడం లో ఎప్పుడు ముందుంటారు. ఇంతకు ముందు వరకు వాళ్ళు చేసిన ప్రతి సినిమా సక్సెస్ ని సాధించడమే కాకుండా తెలుగులో డబ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగేవి…కానీ ఈ మధ్యకాలంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో అన్నిటికంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ వెనకబడి ఉందనే చెప్పాలి. ఇక వీళ్ళ నుంచి వచ్చే ఏ పాన్ ఇండియా సినిమా కూడా సక్సెస్ ని సాధించకపోవడంతో కేవలం తమిళ్, తెలుగుకు మాత్రమే వీళ్ళ మార్కెట్ అనేది పరిమితమవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ ని సాధించాలని స్టార్ హీరోలు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్లకు ఒక్క సక్సెస్ కూడా దక్కడం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘అభిషణ్ జీవింత్’ (Abhishan Jivinth) అనే ఒక కుర్ర డైరెక్టర్ ‘ టూరిస్ట్ ఫ్యామిలీ’ (Turiost Family) అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాకుండా సెలబ్రిటీలను కూడా ఇంప్రెస్ చేసింది.నిజానికి రాజమౌళి (Rajamouli) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమాని చూసి సినిమా అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేయడంతో ఈ సినిమాకి భారీగా ప్రమోషన్ అయితే లభించింది. ఇక ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జియో హాట్ స్టార్ లో ఈ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది…
ఈ సినిమా రాజమౌళికి విపరీతంగా నచ్చడానికి గల కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ఒక కాలనీలో నివసించే మనుషులు రకరకాల ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు. టూరిస్ట్ ఫ్యామిలీ గా వచ్చిన ఒక ఫ్యామిలీ వాళ్లందరికీ అండ గా నిలిచి వాళ్ళ కష్టాలను సాల్వ్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తారు.
ఇక ఈ సినిమాలో మొత్తంలో ఒక ఆవిడ చనిపోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు పట్టించుకోకుండా ఉంటారు. ఇక టూరిస్ట్ ఫ్యామిలీ యజమాని అయిన శశి కుమార్ (Shashi Kumar) ఆ పెద్దావిడ చనిపోయింది అని స్ట్రీట్ లో ఉన్న వాళ్లందరికీ చెప్పి వాళ్ళను ఆ చనిపోయిన ఇంటికి తీసుకువస్తాడు.
అప్పటి దాకా అసలు ఎవరు ఎవరితో మాట్లాడుకోరు… అయినప్పటికి ఆయన వాళ్లందరినీ తీసుకువచ్చి ఆమె అంతిమ యాత్ర ను గ్రాండ్ గా చేస్తాడు…ఈ సీన్ అయితే చాలా బాగుంది…ఇక రాజమౌళికి నచ్చిన సీన్ కూడా ఇదేనట…మొత్తానికైతే దర్శకుడు ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు…
Also Read: సూరత్ రికార్డును అధిగమించిన విశాఖ!