https://oktelugu.com/

Rashmi Gautam : చెప్పు తెగుద్ది.. సీనియర్ కమెడియన్ పై రష్మీ ఫైర్!

Rashmi Gautam : ఓ సీనియర్ కమెడియన్ పై ఫైర్ అయ్యింది యాంకర్ రష్మీ. చెప్పు తెగుద్ది అంటూ పరుష కామెంట్స్ చేసింది. రష్మీ తీరు ఒకింత షాక్ ఇచ్చింది. ఇంతకీ రష్మీకి అంతగా ఎందుకు కోపం వచ్చింది.

Written By: , Updated On : April 1, 2025 / 10:45 AM IST
Rashmi Gautam

Rashmi Gautam

Follow us on

Rashmi Gautam : హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మీ గౌతమ్ కి సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. దాంతో ఆమె యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలోకి రష్మీ గౌతమ్ వచ్చింది. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ కావడంతో రష్మీ భారీ పాపులారిటీ రాబట్టింది. ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో మరొక షో స్టార్ట్ చేయడంతో అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది. 2022 వరకు అనసూయ జబర్దస్త్ లో కొనసాగింది. అనసూయ వెళ్లిపోవడంతో సౌమ్యరావు, సిరి హన్మంత్ జబర్దస్త్ యాంకర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. వారెవరూ రాణించలేదు.

ఎక్స్ట్రా జబర్దస్త్ టైటిల్ తొలగించి.. రెండు వారాల జబర్దస్త్ ఎపిసోడ్స్ కి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది. అనసూయ లేనప్పటికీ తన గ్లామర్ తో జబర్దస్త్ ఆడియన్స్ ని రష్మీ గౌతమ్ మెప్పించే ప్రయత్నం చేస్తుంది. కాగా జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకరైన బుల్లెట్ భాస్కర్ పై రష్మీ ఘాటైన కామెంట్ చేసింది. జబర్దస్త్ వేదిక మీద ఈ పరిణామం చోటు చేసుకుంది. రష్మీని చూస్తూ.. పక్కకురా.. అనే అర్థం బుల్లెట్ భాస్కర్ తల ఊపాడు. ఆగ్రహించిన రష్మీ.. చెప్పు తెగుద్ది. మీ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు లేరా?, అంది.

Also Read : నా ప్రేమ నిజమైతే..నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్!

ఉన్నారు.. కానీ వదిన కావాలి అంటున్నారు, అని బుల్లెట్ భాస్కర్ సమాధానం చెప్పాడు. అయితే స్కిట్ లో భాగంగానే బుల్లెట్ భాస్కర్ ని రష్మీ చెప్పుతో కొడతాను అన్నది. కామెడీ కోసం అంత పెద్ద మాట అనడం ఒకింత ఇబ్బందిగా అనిపించింది. కాగా జబర్దస్త్ ఒకప్పటి వైభవం కోల్పోయింది. అంతగా కామెడీ పండటం లేదు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర వంటి స్టార్స్ వెళ్ళిపోయాక, క్వాలిటీ కామెడీ జబర్దస్త్ లో దొరకడం లేదు. ఈ మధ్య డబుల్ మీనింగ్స్ జోక్స్ కూడా ఎక్కువ అయ్యాయి.

రోజా, నాగబాబు, అనసూయ ఉన్నప్పుడు జబర్దస్త్ పీక్స్ కి చేరింది. ఈ కామెడీ షో టీ ఆర్పీని ఎవరూ బీట్ చేయలేకపోయారు. జబర్దస్త్ స్ఫూర్తితో ఇతర ఛానల్స్ లో కామెడీ షోలు ప్రసారం అయ్యాయి. జబర్దస్త్ మాదిరి సక్సెస్ కాలేదు. శివాజీ, కుష్బూ ప్రస్తుతం జడ్జెస్ గా ఉన్నారు. రష్మీ మాత్రమే కొనసాగుతుంది. ఆ మధ్య హీరోయిన్ గా సినిమాలు చేసిన రష్మీకి ఆఫర్స్ రావడం లేదు. దాంతో బుల్లితెరకు పరిమితం అయ్యింది.

Also Read : ఆసుపత్రి పాలైన ప్రముఖ యాంకర్ రష్మీ..వైరల్ అవుతున్న ఫోటోలు..విచారం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..అసలు ఏమైందంటే!

 

Jabardasth Latest Promo - 04th & 05th April 2025 - Fri & Sat @9:30 PM - Etv Telugu