Relation Ship: కొత్త పెళ్లి చేసుకునే ఎవరైనా కూడా అర్థం చేసుకునే భాగస్వామి రావాలని కోరుకుంటారు. అన్ని విధాలుగా అర్థం చేసుకున్న అమ్మాయి లేదా అబ్బాయి తన లైఫ్‌లో ఉంటే జీవితం సాఫీగా సాగుతుందని భావిస్తారు. అదే అర్థం చేసుకుని భాగస్వామి రాకపోతే జీవితం ఓ నరకంలా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే విడిపోతున్నారు. వ్యక్తిగత కారణాలు, కెరీర్ విషయంలో ఇలా ఏవో కారణాలతో పెళ్లయిన ఏడాదికే విడిపోతున్నారు. తెలిసో, తెలియక చేసిన చిన్న తప్పుల వల్ల పెళ్లి చివరకు పెటాకులు అవుతుంది. తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటున్నారు. అయితే పెళ్లయిన కొత్తలో కొన్ని నియమాలు పాటించకపోవడం వల్ల కూడా జంటలు విడిపోతున్నారని నిపుణులు అంటున్నారు. కొందరు అసలు భాగస్వామికి సమయం ఇవ్వకపోవడం, పట్టించుకోకపోవడం వల్ల గొడవలు వచ్చి విడిపోతున్నారని అంటున్నారు. కాబట్టి కొత్తగా పెళ్లయిన వాళ్లు కొన్ని టిప్స్ పాటిస్తే వారి బంధం జీవితాంతం స్ట్రాంగ్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరి కొత్తగా పెళ్లయిన వారు పాటించాల్సిన ఆ టిప్స్ ఏంటో చూద్దాం.
ఎక్కువ సమయం గడపడం
కొత్తగా పెళ్లయిన వారు భాగస్వామికి సమయం ఇస్తూ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయాలి. కేవలం పెళ్లయిన కొత్తలోనే కాకుండా ఎప్పటికీ కూడా భాగస్వామికి ఇవ్వాలసిన సమయం ఇస్తేనే ఎంతటి బంధం అయిన స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒకరి పనుల్లో ఒకరు బిజీగా ఉండి పూర్తిగా మాట్లాడుకోరు. దీనివల్ల ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు. దీంతో చిన్న విషయాలకు ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోతుంటారు. కాబట్టి కాస్త సమయం సెట్ చేసుకుని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే బంధం ఎప్పటికీ బలంగా ఉంటుంది.
గొడవలు సహజం
ఏ బంధంలో అయిన గొడవలు సహజమే. చిన్న విషయాలకు గొడవ పడిన వాటిని పెద్దవి చేసుకుని విడిపోకుండా వెంటనే కలిసిపోండి. గొడవలు సహజమేనని మీ భాగస్వామికి చెప్పండి. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం ఇంకా బలపడుతుంది. ప్రతీ దానికి గొడవలు పడకుండా కొన్ని విషయాలకు అర్థం చేసుకోవడం, సర్దుకోవడం వంటివి ఇద్దరూ చేయాలి. అప్పుడే బంధం స్ట్రాంగ్‌గా ఉంటుంది.
ఇతరులతో పోల్చవద్దు
భాగస్వామి ఏదైనా చేస్తే ఇతరులతో పోల్చవద్దు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. నా కంటే ఇంపార్టె్న్స్ వేరే వాళ్లు ఉన్నారని అనిపిస్తుంది. కాబట్టి భాగస్వామి ఏదైనా తప్పు చేస్తే ఇలా కాదు వేరేలా చేయాలి అనే చెప్పాలి. అంతే కానీ వేరే వారిలా చేయాలని చెప్పవద్దు.
విమర్శించవద్దు
కొందరు భాగస్వామి తప్పులను విమర్శిస్తుంటారు. ఇలా చేస్తే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భాగస్వామి ఏదైనా తప్పు చేస్తే.. ఇది తప్పు చేయవద్దని చెప్పాలి. అంతే కానీ నువ్వు అలా చేశావు, ఇలా చేశావని విమర్శించవద్దు. ఇలా ఎప్పుడైతే విమర్శించడం స్టార్ట్ చేస్తారో అప్పుడే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
ఏకాంతంగా గడపండి
ఏ బంధం అయిన స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇద్దరి మధ్య కొంత ఏకాంత సమయం ఉండాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు. కొత్తగా పెళ్లయిన వారు కనీసం నెలకు ఒకసారి అయిన కూడా ఏకాంతంగా గడపండి. కొత్త ప్రదేశాలకు వెళ్లడం వంటివి చేస్తే సంతోషంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.