Parenting Tips: పదేళ్లలోపు పిల్లలకు ఈ 5 అలవాట్ల గురించి తప్పకుండా చెప్పాలి..

స్కూలు కెళ్లే పిల్లలు ఉదయం లేవడానికి ఇబ్బంది పడుతారు. అలా అని వారిని విడిచిపెడితే బద్దకస్తులవుతారు. వారిని ప్రతి రోజూ ఒకే సమయంలో నిద్ర లేపండి.

Written By: Chai Muchhata, Updated On : December 10, 2023 3:58 pm

Parenting Tips

Follow us on

Parenting Tips: నేటి బాలలే రేపటి పౌరులు.. అంతేకాదు భవిష్యత్ ను తీర్చిదిద్దే మేధావులు.. అందుకే పిల్లల పెంపక విషయంలో జాగ్రత్తలు పాటించాలని అని చాలా మంది అంటారు. సరైన వాతావరణంలో పిల్లలు పెరిగితే వారి భవిష్యత్ బాగుంటుంది. అందుకోసం ఓ వైపు పాఠశాలలు, మరోవైపు తల్లిదండ్రులు వారికి సహకరించాలి. వారికి ఉన్న డౌట్స్ ను క్లియర్ చేయాలి.. సరైన ఆహారం అందించాలి.. ఒత్తిడి లేకుండా చూడాలి.. ఇదే సమయంలో వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాలి. ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు పిల్లలకు కొన్ని మంచి విషయాలను అలవాటు చేయాలి. అలా చెబితే వారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అవేంటంటే?

ఉదయం లేవగానే..
స్కూలు కెళ్లే పిల్లలు ఉదయం లేవడానికి ఇబ్బంది పడుతారు. అలా అని వారిని విడిచిపెడితే బద్దకస్తులవుతారు. వారిని ప్రతి రోజూ ఒకే సమయంలో నిద్ర లేపండి. అలాగే పళ్లను బాగా శుభ్రం చేసుకునే విధంగా చెప్పండి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే రాను రాను పట్టించుకోరు. అలాగే దంతాలను శుభ్రం చేసుకోవడంతో పాటు ప్రతిరోజూ కచ్చితంగా ఒకే సమయానికి స్నానం చేయాలని చెప్పండి. ఈ అలవాట్లు లేకపోతే ఏం జరుగుతుంతో వారికి వివరించండి.

సొంత పనులు:
స్కూలుకెళ్లె విద్యార్థులకు తల్లిదండ్రులు కొన్ని పనులు చెబుతారు. అయితే చిన్నప్పుడే వారి పనులు వారిని చేసుకోనివ్వాలి. ముఖ్యంగా స్కూలుకెళ్లె ముందు షూ లేస్ కట్టుకోవడం.. షర్ట్ బటన్స్ పెట్టుకోవడం లాంటివి వారినే చేసుకోనివ్వాలి. వీటితో పాటు చేతలును పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పాలి. పరిశుభ్రత లేకపోతే ఏం జరుగుతుందో వారికి వివరించండి.

పెద్దలను గౌరవించడం:
కొందరు పిల్లలు పెద్దయ్యాక పెద్దవాళ్లు అంటే రెస్పెక్ట్ ఉండదు. అందుకు చిన్నప్పుడు వారికి తెలియజేయకపోవడమే కారణం. అందువల్ల చిన్నప్పుడే వారికి పెద్దవాళ్ల విషయంలో గౌరవంతో ఉండాలని చెప్పాలి.మర్యాద తో పాటు భయం కూడా తెలియజేయాలి. ఇతరులతో ఎలా మాట్లాడాలి? అనే విషయాలు చెప్పాలి.

మొక్కల పెంపకం:
సెలవుల సమయంలో పిల్లలు ఇంట్లో ఉంటూ ఎక్కువగా సెల్ చూసే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే ఈ సమయంలో వారు ఖాళీగా ఉండకుండా మొక్కలను పెంచడం, సైకిల్ ను శుభ్రం చేయించడం, జంతువులతో ఆడుకోవడం వంటివి నేర్పించాలి. ఇలా చేయడం వల్ల వారు స్కూళ్లో ఉన్న ఒత్తిడిని అధిగమించుతారు.

సమస్యకు పరిష్కారం:
చాలా మంది పెద్దయ్యాక చిన్న సమస్యకే పెద్దగా వణికిపోతారు. ఒక సమస్య ఎదురైతే తట్టుకోలేకపోతారు. అయితే చిన్నప్పుడే కొన్ని సమస్యల గురించి వారికి వివరించాలి. అలాంటి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలను చెప్పాలి. అప్పుడే వారు పెద్దయ్యాక ఎటువంటి ప్రాబ్లమ్ ను అయినా ఫేస్ చేయగలుగుతారు.