https://oktelugu.com/

Sun : ఎండలో వెళ్తున్నారా..? ఈ దుస్తులు వేసుకుంటే డేంజర్? మరి ఎలాంటివి ధరించాలి?

Sun : ఎండాకాలం సమీపిస్తుంది. దీంతో వాతావరణం వేడిగా ఉంటుంది. అయితే వేడి నుంచి తట్టుకోవడానికి చాలామంది రకరకాల కూలింగ్ సదుపాయాలని ఏర్పాటు చేసుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 14, 2025 / 02:00 AM IST
    Sun

    Sun

    Follow us on

    Sun : ఎండాకాలం సమీపిస్తుంది. దీంతో వాతావరణం వేడిగా ఉంటుంది. అయితే వేడి నుంచి తట్టుకోవడానికి చాలామంది రకరకాల కూలింగ్ సదుపాయాలని ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో ఉండే వాళ్ళు అయితే ఏసీలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా వెనుకాడరు. అలాగే కొందరు కూలర్లతో సరిపెట్టుకుంటారు. అయితే ఇంట్లో ఉన్నంతసేపు చల్లటి వాతావరణం లో ఉండొచ్చు. కానీ బయటకు వెళ్లిన తర్వాత కూడా మనకు అనుకూలంగా ఉండాలంటే సాధ్యం కాదు. అందువల్ల బయటకు వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత నుంచి తట్టుకోవడానికి కొన్ని రకాల దుస్తులను ధరించాలి. ఇది ధరించడం వల్ల ఎండ వేడి నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది. మరి వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలి? వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?

    Also Read : పక్షులను ఈ మొక్కలు ఆకర్షిస్తాయట.. ఇంతకీ ఆ మొక్కలు ఏవంటే?

    వేసవిలో వాతావరణం వేడెక్కడంతో శరీరంలో నుంచి కూడా ఉష్ణోగ్రత బయటకు వస్తుంది. దీంతో చెమట ఎక్కువగా వస్తుంది. అయితే బయటకు వెళ్ళినప్పుడు కొందరు సాధారణ దుస్తులు ధరిస్తారు. ఉదాహరణకు నల్లటి దుస్తులు ధరించడం వల్ల ఉష్ణోగ్రత మరింతగా పెరిగి శరీరాన్ని అధిక ఉష్ణోగ్రతలో ఉంచుతుంది. అయితే కాటన్ దుస్తులు ధరించి బయటకు వెళ్లాలని కొంతమంది చెబుతూ ఉంటారు. ఇవి చెమటను పీల్చుకొని శరీరాన్ని కూల్ గా ఉంచుతాయి. అయితే కొంతమంది చెబుతున్న ప్రకారం కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఇవి చెమటకు తడిచిపోయి అలాగే ఉంటాయని అంటున్నారు. ఈ క్రమంలో మెరీనో వూల్ బట్టలు సౌకర్యంగా ఉంటాయని కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి ఏమను పీల్చుకొని ఇలాంటి దుర్వాసన రాకుండా చేస్తాయని పేర్కొంటున్నారు

    అయితే ఏ రకమైన దుస్తులు ధరించిన అవి నాణ్యమైనవి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాటన్లో కూడా నాసిరకం దుస్తులు ధరిస్తే శరీరానికి అవి ఇబ్బందిని కలిగిస్తాయి. అంతేకాకుండా ఇవి ఎండ వేడి నుంచి రక్షించబడవు. అందువల్ల వేసవికాలంలో దాదాపు నాణ్యమైన దుస్తులను ధరించే ప్రయత్నం చేయాలి. అయితే నాణ్యమైన దుస్తులైన కాటన్ మాత్రమే ధరించాలని చెబుతున్నారు. పాలిస్టర్, నైలాన్ వంటివి ధరించడం వల్ల శరీరంపై రాశేష్ వస్తాయని పేర్కొంటున్నారు.

    ఇటీవల కొన్ని స్పోర్ట్స్ కంపెనీలు చేసిన పరిశోధనల ప్రకారం కోటింగ్ లేని కాటన్, లైనింగ్, నైలాన్, పాలిస్టర్ దుస్తులు కూడా ధరించడానికి అనుకూలంగానే ఉంటాయని చెబుతున్నారు. అధిక ధరను వెచ్చించి కొనుగోలు చేయలేని వారు ఇలాంటివి వాడుకోవచ్చని పేర్కొంటున్నారు. కోటింగ్ లేకపోవడం వల్ల ఇవి చెమటను పీల్చుకొని గాలికి వదిలేస్తాయి. దీంతో శరీరం కూల్ గా మారుతుంది.

    మరో విషయం ఏమిటంటే వేసవికాలంలో ఎక్కువగా ఫిట్ గా ఉండే దుస్తులు ధరించకుండా.. బదులుగా ఉండే వాటిని వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి బదులుగా ఉండడంవల్ల శరీరం లోపలికి గాలి వెళ్లి సౌకర్యంగా ఉంటుంది. అలా కాకుండా బిగుతుగా ఉన్న దుస్తులు వేసుకోవడం వల్ల లోపలికి గాలి వెళ్లలేక చెమటతో ఇబ్బందిగా మారుతుంది. అలాగే బాగా థిక్ గా ఉన్న కర్రలను కాకుండా.. లైట్ కలర్ దుస్తులను వేసుకోవాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎంత ఎండలో వెళ్లినా ఇలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు.

    Also Read : భూమి నుండి పసుపు రంగులో కనిపించే సూర్యుడు అంతరిక్షంలో ఎలా కనిపిస్తాడు?