https://oktelugu.com/

Ind vs Aus : మెల్ బోర్న్ లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ సాధించిన వరల్డ్ రికార్డు ఏంటో తెలుసా?

ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత్ మూడో రోజు అదరగొట్టింది. తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా చేతిలో మ్యాచ్ ఉండగా.. మూడో రోజు మాత్రం అనూహ్యంగా భారత్ వైపు టర్న్ అయింది. దీనికి ప్రధాన కారణం నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2024 / 07:30 PM IST

    Ind Vs Aus 4th Test(8)

    Follow us on

    Ind vs Aus : ఆస్ట్రేలియా బౌలర్లకు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తమ బ్యాటింగ్ పరాక్రమాన్ని రుచి చూపించారు. ఇదే సమయంలో 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని రాశారు. గొప్ప గొప్ప ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డును వీరిద్దరూ సృష్టించారు. మెల్ బోర్న్ టెస్టులో ప్రారంభంలో టీమిండియా కు వరుస శాఖలు తగిలాయి. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఏకంగా 474 రన్స్ చేసింది. ఓపెనర్లు కొనస్టాస్ 60, ఉస్మాన్ ఖవాజా 57, లబూ షేన్ 72 పరుగులతో ఆకట్టుకున్నారు.. స్టీవ్ స్మిత్ అయితే ఏకంగా 140 రన్స్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సంచరులతో ఆకట్టుకున్నాడు.. ఇక క్యారీ 31, కమిన్స్ 49 కూడా అదరగొట్టాడు.

    మళ్లీ ఎదురుదెబ్బ

    ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ వేదికపై కూడా టీమ్ ఇండియాకు షాక్ లు తగిలాయి. రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లీ 36, ఆకాష్ దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17 దారుణంగా విఫలమయ్యారు. అయితే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 82 పరుగులు చేసి సెంచరీ వైపు ప్రయాణం సాగించగా.. అనవసరమైన సింగిల్ కు ప్రయత్నించి రన్ అవుట్ అయ్యాడు. అయితే 8, 9 స్థానాలలో బ్యాటింగ్ కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ మాత్రం ఆస్ట్రేలియా బోర్డర్లను ధైర్యంగా ప్రతిఘటించారు. వీరిద్దరూ ఏకంగా ఎనిమిదో వికెట్ కు 127 రన్స్ జోడించారు. ఇక ఇదే ఊపులో నన్నుతీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ కెరియర్ లో తొలి సెంచరీ చేశాడు. వాషింగ్టన్ సుందర్ ఆఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఈ జోడిని విడగొట్టడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి లయన్ ఈ జోడిని విడదీశాడు. లయన్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది.

    ప్రపంచ రికార్డు

    టెస్ట్ క్రికెట్ చరిత్రలో 8, 9 స్థానాలు బ్యాటింగ్ చేసి ఓకే ఇన్నింగ్స్ లో 150 కి పైగా బంతులు ఎదుర్కొన్న మొట్టమొదటి జోడిగా వాషింగ్టన్ సుందర్ – నితీష్ కుమార్ రెడ్డి జోడి మిరిచారు. ఇక మెల్బోర్న్ మైదానంలో మూడవరోజు ఆట ముగిసే సమయానికి వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. ఇతడు 162 బంతులు ఎదుర్కొన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 10 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 105 పరుగులు చేశాడు. ఇతడు 176 బంతులను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ 358/9 పరుగుల వద్ద ఉంది. ఆస్ట్రేలియా కంటే 116 పరుగులు వెనుకబడి ఉంది. కమిన్స్, బోలాండ్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. లయన్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు.