spot_img
Homeబిజినెస్Mutual Funds:  చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ తో రూ.30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ఎలా...

Mutual Funds:  చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ తో రూ.30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే?

Mutual Funds:  ప్రస్తుత కాలంలో చాలామంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు చేయడానికి ఇష్టపడుతున్నారు. పిల్లల పేర్లపై మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో సులభంగా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ పేరుతో పలు బ్యాంకులు పిల్లల పేర్లపై మ్యూచువల్ ఫండ్స్ ను తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తల్లీదండ్రులు పన్ను ఆదా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ పేరుతో మ్యూచువల్ ఫండ్ ను అమలు చేస్తోంది. నెలకు 5000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10.36 శాతం రాబడితో 15 సంవత్సరాల తర్వాత ఏకంగా 20 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది.

పిల్లలు చిన్న వయస్సులో ఉన్న సమయంలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమవుతాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ పేరుతో అమలు చేస్తున్న ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత 24 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫండ్ గరిష్టంగా 15.48 శాతం రాబడిని అందించింది. మరో బ్యాంక్ హెచ్.డీ.ఎఫ్.సీ కూడా చిల్డ్రన్స్ ఫండ్ పేరుతో ఫండ్ ను అమలు చేస్తోంది.

నెలకు 5,000 రూపాయల చొప్పున ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 16.12 శాతం రాబడి లభిస్తుంది. 15 సంవత్సరాల తర్వాత ఏకంగా 30 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
Oktelugu Epaper