Mutual Funds: ప్రస్తుత కాలంలో చాలామంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు చేయడానికి ఇష్టపడుతున్నారు. పిల్లల పేర్లపై మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో సులభంగా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ పేరుతో పలు బ్యాంకులు పిల్లల పేర్లపై మ్యూచువల్ ఫండ్స్ ను తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తల్లీదండ్రులు పన్ను ఆదా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ పేరుతో మ్యూచువల్ ఫండ్ ను అమలు చేస్తోంది. నెలకు 5000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10.36 శాతం రాబడితో 15 సంవత్సరాల తర్వాత ఏకంగా 20 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది.
పిల్లలు చిన్న వయస్సులో ఉన్న సమయంలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమవుతాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ పేరుతో అమలు చేస్తున్న ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత 24 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫండ్ గరిష్టంగా 15.48 శాతం రాబడిని అందించింది. మరో బ్యాంక్ హెచ్.డీ.ఎఫ్.సీ కూడా చిల్డ్రన్స్ ఫండ్ పేరుతో ఫండ్ ను అమలు చేస్తోంది.
నెలకు 5,000 రూపాయల చొప్పున ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 16.12 శాతం రాబడి లభిస్తుంది. 15 సంవత్సరాల తర్వాత ఏకంగా 30 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.