Chanakya Niti Problems: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పాడు. మనిషి కష్టకాలంలో ఎలా ప్రవర్తించాలి? ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలపై వివరించాడు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి కావాల్సిన యుక్తుల గురించి తెలిపాడు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, సహనం కోల్పేతే నష్టం వస్తుందని సూచించాడు. అందుకే కష్టాలను ఎదుర్కొనే వాడే నిజమైన వీరుడు అని చాటాడు.
సమస్యను అర్థం చేసుకోవాలి
మనకు సమస్య ఎదురైనప్పుడు దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలి. సాధ్యమైనంత సులభంగా పరిష్కరించేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలి. కష్టాల సమయంలో దృఢంగా ఉండాలి. అప్పుడే మనకు ఎన్ని సమస్యలు వచ్చినా మంచి ఆలోచనలతో ఎదుర్కొంటే మంచి ఫలితాలు వస్తాయి.
పెద్దల సలహా తీసుకుంటే మంచిదే
సమస్య తీవ్రమైనదైతే అనుభవజ్ఝుల సలహా తీసుకోవడంలో తప్పు లేదు. సమస్య పరిష్కారానికి దారులు దొరకకపోతే ఇతరుల నుంచి సలహాలు తీసుకుకుంటే మనకు పనికొచ్చే అవకాశం ఉంటే వాడుకోవాలి. లేదంటే కొత్త ఆలోచన చేసుకోవాలి. క్లిష్ట సమయంలో మనకు మార్గనిర్దేశం చేసే వారికి ఇలాంటి అవకాశం ఇవ్వడంలో వెనకడుగు వేయకూడదు.
సహకారం
కష్టకాలంలో భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలవాలి. సమస్య తీవ్రతను గుర్తించి దాని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో విజయాలు సులభతరంగా మారతాయి. సమస్యను పంచుకుంటే తగ్గుతుంది. తలుచుకుంటే పెరుగుతుంది. అందుకే ఇద్దరు అవగాహనతో పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేయడం మంచిది.